KTR Challenge: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్‌, రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ విమర్శల దాడి పెంచుతూ ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ పార్టీ ప్రచారంలోకి దూకింది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ భ‌వ‌న్‌లో బుధవారం జరిగిన మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజకవర్గ సన్నాహక స‌మావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Legal Notice: మీడియా సంస్థలకు కేటీఆర్‌ భారీ షాక్‌.. బామ్మర్దితో ఛానల్స్‌కు రూ.160 కోట్ల నోటీసులు


ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి సంచలన సవాల్‌ విసిరారు. 'ద‌మ్ముంటే రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలి' అని రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ సవాల్‌ చేశారు. ఐదేండ్లలో ఎంపీగా మ‌ల్కాజ్‌గిరిలో రేవంత్ ఒక్క ప‌ని చేయ‌లేదని విమర్శించారు. ఎవ‌ర్నీ ప‌లుక‌రించినా పాపాన పోలేదని మండిపడ్డారు. ఆవేశానికి పోతే ఓడిపోతాన‌ని రేవంత్ భ‌య‌ప‌డ్డాడు అని పేర్కొన్నారు. అందుకే ప‌లుక‌లేదని తెలిపారు. 'రేవంత్ రెడ్డి మ‌ల్కాజ్‌గిరిలో నిల‌బ‌డేందుకు భ‌య‌ప‌డుతున్నాడు. ఏప్రిల్ 18వ తేదీన నామినేష‌న్లు. స‌మ‌యం చాలా ఉంది కాబ‌ట్టి రేవంత్‌కు ధైర్యం వ‌చ్చి రాజీనామా చేసి వ‌స్తే నేను వ‌స్తా.. త‌ప్ప‌కుండా నిలబ‌డుతాను' అని ప్రకటించారు. 

Also Read: KT Rama Rao: యూట్యూబ్ ఛానళ్లపై కేటీఆర్‌ యుద్ధం.. ఇక ఆయా ఛానళ్ల వారికి చుక్కలే


 


అయితే రేవంత్‌ రెడ్డి తన సవాల్‌ స్వీకరించే దమ్ము లేదని కేటీఆర్‌ తెలిపారు. 'నాకు తెలుసు రేవంత్‌ రెడ్డి రాడు. పిరికోడు. న‌రుకుడు ఎక్కువ‌.. అస‌లు విష‌యానికి వ‌స్తే పారిపోతాడు. చాలా పెద్ద మాట‌లు, డైలాగులు చెబుతాడు. కానీ ఆచ‌ర‌ణ‌లో మాత్రం చూపించ‌డు' అని రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. మ‌ల్కాజ్‌గిరిలో పోటీ వ్య‌క్తుల మ‌ధ్య కాదు.. పోటీ మూడు పార్టీల మ‌ధ్య అని తెలిపారు. 'కేసీఆర్ నిల‌బ‌డ్డారని భావించి ప‌ని చేయాలి' అని పార్టీ కేడర్‌కు సూచించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు సెగ్మెంట్ల‌లో తుఫానులా మెజార్టీ ఇచ్చారని గుర్తు చేశారు. మూడు ల‌క్ష‌ల యాభై ఓట్ల మెజార్టీ వ‌చ్చిందని వివరించారు. ప్ర‌తి కార్య‌క‌ర్త క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్ర‌తి ఇంటికి వెళ్లి రాగిడి ల‌క్ష్మారెడ్డి మల్కాజిగిరి ఎంపీగా గెలిచేలా పని చేయాలని చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook