KTR Arrest: రాజకీయంగా ఎదుర్కోలేక.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఫార్మూలా ఈ రేసులో అవినీతి జరిగిందని చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని.. ఒకవేళ ఈ అంశంలో జైలుకు పంపితే హాయిగా వెళ్తానని కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. 'నన్ను జైలులో పెడితే పోతాను. 2, 4 నెలలు ఉంటా. మంచిగా యోగా చేస్తా. బయటికి వచ్చాక పాదయత్ర చేస్తా' అని కేటీఆర్‌ ప్రకటన చేయడం కలకలం రేపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Civils Mains: నిరుద్యోగులకు జాక్ పాట్.. ఒక పరీక్ష పాసయితే రూ.లక్ష డబ్బులు మీకే


హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌పై రేవంత్‌ ప్రభుత్వం చేస్తున్న డ్రామాపై.. తన అరెస్ట్‌ ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేనేమీ తప్పు చేయలేదు. డైవర్షన్‌లో భాగంగా రేవంత్‌ నన్ను అరెస్ట్‌ చేస్తే చేస్తాడేమో. నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతామంటే నేను సిద్ధం' అని కేటీఆర్‌ ప్రకటించారు.

Also Read: Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి యూటర్న్‌.. రేవంత్‌ రెడ్డి కార్యక్రమానికి మద్దతు


'నన్ను జైల్లో పెడితే యోగా చేస్తా బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తా' అంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాజ్ భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటిగా మారి బీఆర్‌ఎస్‌ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నాయని చెప్పారు. గవర్నర్ విచారణకు అనుమతి ఇస్తే స్వాగతిస్తానని.. తప్పు చేయలేదు కాబట్టి ఏ విచారణకు అయినా సిద్దమని ప్రకటించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా ఈ రేస్ ఇక్కడికి తెచ్చామని వివరించారు. 


'ప్రపంచ వ్యాప్తంగా మోటార్ కార్ల రేసింగ్ అనేది ఒక క్రీడ. ఈ కార్ రేసింగ్ క్రీడకు మంచి ఆదరణ ఉంది. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఎఫ్ 1 రేస్ సీఈఓను కలిసి రంగారెడ్డి జిల్లాలో పెట్టాలని కోరితే.. దానిని దశాబ్దాల తర్వాత మేము నెరవేర్చాం. ఫార్ములా ఈ రేస్‌తో ప్రభుత్వానికి.. హైదరాబాద్‌కు మంచే జరిగింది. అనేక కోట్ల పెట్టుబడులు వచ్చాయి' అని కేటీఆర్‌ వివరించారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తియ్యకు అని విజ్ఞప్తి చేశారు. తన చుట్టు ఉచ్చు అని అంటున్నారని.. దీనిలో ఉచ్చు, బొచ్చు అనేది ఏముందని నిలదీశారు.


'నిజానికి కేసు పెట్టాలంటే మేఘా కంపెనీ మీద పెట్టాలి. కృష్ణా రెడ్డి మీద ఏసీబీ మీద కేసు పెట్టే దమ్ముందా రేవంత్ రెడ్డి?' అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. 'రాఘవ కంపెనీ, మేఘా కంపెనీలకు కేకులు కేసినట్లు ఇచ్చిన పనులకు సంబంధించి కేసులు పెట్టాలె. రూ.50 లక్షల బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డిపై ఎనిమిదేళ్లుగా ఎలాంటి చర్యలు లేవు' అని కేటీఆర్‌ గుర్తుచేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి