KCR Deeksha Diwas: 'తెలంగాణ నాయకులు పదవుల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెడతారన్న అపవాదుకు వ్యతిరేకంగా ముందు తన పదవులకు రాజీనామా చేసి కేసీఆర్‌ పార్టీని ప్రారంభించి.. పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహా నాయకుడు కేసీఆర్‌' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కేసీఆర్ అంటే ఒక పేరు కాదని.. కేసీఆర్ అంటే ఒక పోరు అని వర్ణించారు. 14 ఏళ్లు ఎదురుదెబ్బలు.. విజయాలు.. అపజయాలు.. ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది చదవండి: Lagacharla Farmers: లగచర్ల రైతుల విజయం.. రేవంత్‌ రెడ్డి మరో యూటర్న్‌!


కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్ష సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ దీక్షా దివాస్ నిర్వహించింది. కరీంనగర్‌లోని అల్గునూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌ తదితరులతో కలిసి కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీతో అత్యంత అనుబంధం ఉందని గుర్తుచేసుకుంటూ కరీంనగర్‌ గడ్డకు.. కరీంనగర్ బిడ్డకు వందనం తెలిపారు. కేసీఆర్ కరీంనగర్ వేదికగా 'నా శవయాత్రనో.. తెలంగాణ జైత్రయాత్రనో' అంటూ గర్జించారని గుర్తుచేశారు.


ఇది చదవండి: Mallampally: ఏడాది సంబరాల్లో మంత్రి సీతక్కకు రేవంత్‌ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్‌!


'ఆనాడు తెలంగాణను ఆంధ్రాతో కలిపి ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీయే. 1969 పోరాటంలో 371 మంది అసువులు బాసారు. అయినా సరే తెలంగాణ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ బేఖాతరు చేసింది' అని కేటీఆర్‌ చరిత్రను గుర్తుచేశారు. 'కరీంనగర్ వేదికగా రణగర్జనతో కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టండంటూ ఎంతో ధైర్యంగా కేసీఆర్ ప్రకటన చేశారు. పదవి త్యాగంతో ఉద్యమాన్ని మొదలు పెట్టి.. ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నేత కేసీఆర్ మాత్రమే' అని వివరించారు.


'ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక్కో మాట తూటాలాగా పేలింది. రాజకీయ వేదికల ద్వారానే తెలంగాణ సాధిస్తామని కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి కేసీఆర్ నాయకత్వం, అమరుల ప్రాణత్యాగం, కాంగ్రెస్ కర్కషత్వం కారణాలు' అని కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపైక తుపాకీ పట్టిన రేవంత్‌ రెడ్డి ఏదోదో వాగుతున్నాడని మండిపడ్డారు. 'అధికారం ఉండవచ్చు.. కానీ ప్రజల గుండెల్లో మాత్రం కేసీఆర్ గారంటేనే ఎనలేని అభిమానం' అని తెలిపారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ హిమాలయమైతే నువ్వు ఆయన కాలిగోటికి కూడా సరిపోవని పేర్కొన్నారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.