KTR: ప్రియమైన చెల్లెలు కవిత అరెస్ట్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే?
KT Rama Rao Tweet About Kavitha Arrest: తన ప్రియమైన చెల్లెలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ఆమె సోదరుడు కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. `ఎక్స్` వేదికగా శపథం చేశారు.
Kavitha Arrest: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్ స్పందించారు. అరెస్ట్ కాకుండా తీవ్రంగా అడ్డగించినా కుట్రపూరితంగా అదుపులోకి తీసుకుని కవితను ఢిల్లీకి తీసుకెళ్లారు. విచారణ నుంచి అరెస్ట్ వరకు కవిత వెన్నంటే కేటీఆర్ ఉన్నారు. కవితను ఢిల్లీకి తీసుకెళ్లిన అనంతరం 'ఎక్స్' వేదికగా కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.
Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?
'అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా రాజ్యాంగ సంస్థలను అత్యంత దుర్మార్గంగా వినియోగించుకుంటోంది. తన రాజకీయ అవసరాల కోసం వాటిని దుర్వినియోగం చేస్తోంది. ఈనెల 19వ తేదీకి విచారణ వాయిదా వేసిన సమయంలో ఈడీ అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గౌరవ సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఈడీ నిలబెట్టుకోకపోవడం మరింత దారుణ విషయం. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. త్వరలోనే న్యాయం గెలుస్తుంది' అని కేటీఆర్ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి ఊహించని స్పందన లభిస్తుంది. నెటిజన్లు కూడా కవిత అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కుట్రలో భాగమే కవిత అరెస్ట్ అని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Kavitha Arrest Updates: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి
కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న కుట్రలను గతంలో వివిధ పార్టీల నాయకులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలు చేస్తున్న దాడులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలపై చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ వెలుగులోకి తెచ్చారు. ఈడీ, సీబీఐ ఇతర సంస్థలపై విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ పోస్టులను చూస్తుంటే కవిత అరెస్ట్ అక్రమం అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter