'కరోనా' మహమ్మారిని ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ పకడ్బందీగా లాక్ డౌన్ అమలవుతోంది. ఐతే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వారిని తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


మాట వినని వారిపై పోలీసులు లాఠీ కూడా ఝుళిపిస్తున్నారు. దీంతో ఎక్కడిక్కడ పోలీసులకు, పౌరులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అలాంటి గొడవే ఒకటి వనపర్తి జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తికి, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో  అతన్ని పోలీసులు చితకబాదారు. కన్న కొడుకు ముందే పోలీసులు దౌర్జన్యంగా అతన్ని తీవ్రంగా కొట్టి ..జీపులో లాగి  పడేశారు. కొడుకు ఎంత మొత్తుకున్నా .. పోలీసులు పట్టించుకోలేదు.  దీన్ని ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు.



ఈ వీడియో చూసిన కేటీఆర్ ..  తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పోలీసుల ప్రవర్తన మొత్తం పోలీసు శాఖకే మచ్చ తీసుకొస్తుందని అన్నారు. సరిగ్గా డ్యూటీ చేసే పోలీసులపైనా దీని ప్రభావం పడుతుందన్నారు. అందుకే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మెహమూద్ అలీతోపాటు డీజీపీని కోరారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..