KTR Leg Injury: మంత్రి కేటీఆర్ కాలికి గాయం.. ఓటిటిలో టైమ్ పాస్ షోలు చెప్పండని ట్వీట్
KTR Leg Injury :మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. ఇవాళ కిందపడటంతో ఎడమ కాలు మడిమకు గాయమైందని ట్విటర్ ద్వారా వెల్లడించిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. కాలుకు పట్టి కట్టిన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు తేల్చిచెప్పినట్టు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
KTR Leg Injury : మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. ఇవాళ కిందపడటంతో ఎడమ కాలు మడిమకు గాయమైందని ట్విటర్ ద్వారా వెల్లడించిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. కాలుకు పట్టి కట్టిన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు తేల్చిచెప్పినట్టు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ మూడు వారాల పాటు ఇంట్లో ఖాళీ సమయం బోర్ కొట్టకుండా ఉండటం కోసం ఓటిటి మాధ్యమాల్లో వీక్షించేందుకు ఏవైనా మంచి టైమ్‌పాస్ షోలు ఉంటే చెప్పండి అంటూ నెటిజెన్స్‌ని కోరారు.
మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. కేటీఆర్ అడిగిన సలహాకు నెటిజెన్స్ నుంచి భిన్నరకాల సమాధానాలు లభిస్తున్నాయి. రేపే మంత్రి కేటీఆర్ బర్త్‌డే కూడా కావడంతో కొంత మంది మంత్రికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెబుతూ గెట్ వెల్ సూన్ అని సందేశాలు పంపితే.. ఇంకొంత మంది తమకు తోచిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల పేర్లు చెబుతున్నారు. కొంత మంది నెటిజెన్స్ కేటీఆర్ అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెబితే.. ఇంకొంత మంది తమదైన స్టైల్లో రిప్లై ఇస్తున్నారు.
Also Read : Telangana Rains : హైదరాబాద్ పరిసరాల్లో క్లౌడ్ బరస్ట్! 10 గంటల్లో 267 మిల్లిమీటర్ల వర్షం.. జల ప్రళయమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook