KTR: కొత్త వ్యవసాయ చట్టాలు కేవలం కార్పోరేట్ రంగాలకు కొమ్ముకాస్తాయన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు దీర్ఘకాలికంగా తము మద్దతు ఇస్తాము తెలిపారు కేటీఆర్. టీఆర్ఎస్ దేశంలోని రైతులకు అండగా ఉంటుంది అని  తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షాద్‌నగర్‌లోని జాతీయ రహాదారి 44లో బూర్గుల గేట్ వద్ద ఆందోళనకారులతో మాట్లాడుతూ.. ఉద్యమాలు, ఆందోళనలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కొత్తేం కాదు అని..ఈ సారి కేంద్రం తమ పార్టీకి మరో ఉద్యమం చేసేలా చేస్తోంది అని తెలిపారు కేటీఆర్ (KTR).



Also Read | Postal Ballot : విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కొత్త పోస్టల్ విధానం?


కొత్త వ్యవసాయ (Farm Bills) చట్టాలను నల్ల చట్టాలుగా అభివర్ణించిన తెరాస నేత, ఈ చట్టాలు రైతులనే కాదు పేదవారిని, మధ్య తరగతి వారిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి అని తెలిపారు. వీటి వల్ల నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరగుతాయి అన్నారు కేటీఆర్. నిత్యావరసరాల ధరల నిర్ణయం అనేది కార్పోరేట్ రంగాల చేతికి వెళ్లిపోతుంది అని వాటిని బాగా పెంచేస్తారు అని తెలిపారు.


80 శాతం రైతులు ఆర్థికంగా పేదవారు అని వారు పెద్ద కార్పోరేట్ రంగాలతో ఫైట్ చేయలేరు అన్నారు కేటీఆర్. కొత్త వ్యవసాయ చట్టంలో మద్ధతు ధర గురించి ప్రస్థావన లేదు అని తెలిపారు. రైతుల కన్నీరు దేశానికి మంచిది కాదు అని హితవు పలికారు.


Also Read | Telugu Memes: గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ పోలింగ్, నెటిజెన్ల ట్రోలింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook