KTR: ఎమ్మెల్యేల జంప్ జిలానీలపై కేటీఆర్ సంచలన ట్వీట్.. మాస్ వార్నింగ్
We Will Back Strongly Says KT Rama Rao On BRS Party MLAs Party Changing: దెబ్బ దెబ్బ మీద తగులుతుండడంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్ పార్టీ) కుదేలవుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.
KTR Reacts About MLAs Jumping: అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వరుస కడుతుండడంతో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్ పార్టీ) సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొన్న సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా పార్టీ మారడంతో గులాబీ పార్టీలో నైరాశ్యం అలుముకుంది. పార్టీ ఎమ్మెల్యేల మార్పుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'ఎక్స్' వేదికగా సంచలన ట్వీట్ చేశారు.
Also Read: Sanjay Kumar: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఐదో వికెట్ డౌన్.. కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే
చరిత్ర పునరావృతం అవుతుందని కేటీఆర్ ప్రకటించారు. పార్టీకి ఇలాంటి ఎదురుదెబ్బలు కొత్త కాదని పేర్కొన్నారు. 'అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. గతంలో 2004-06 కాలంలో ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎదుర్కొన్నాం. ఆనాడు ఫిరాయింపులపై తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఏర్పడ్డాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ తలవంచాల్సి వచ్చింది. మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుతుంది' అని కేటీఆర్ 'ఎక్స్'లో పోస్టు చేశారు.
Also Read: KT Rama Rao: రేవంత్ రెడ్డి ఒక కటింగ్ మాస్టర్.. అన్నింటికీ కటింగ్‌లేనా?
లక్ష్యం 18 మంది?
బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అంతకుముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటివరకు ఐదు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఇంకా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని విశ్వసనీయ సమాచారం.
గులాబీ పార్టీ న్యాయ పోరాటం
మొత్తం 18 మందిని చేర్పించుకుని బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలనే ప్రణాళికతో రేవంత్ అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే పార్టీ ఫిరాయింపులపై గులాబీ పార్టీ గుర్రుగా ఉంది. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై న్యాయస్థానంలో కేసులు వేశారు. ప్రస్తుతం ఆ కేసులు విచారణలో ఉన్నాయి. అయితే ఈ ఫిరాయింపులపై గులాబీ పార్టీ తీవ్ర పోరాటం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter