Nirmala Sitharaman Slams Kamareddy collector: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కి మంత్రి కేటీఆర్ హితవు పలికారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో వ్యవహరించిన తీరుపై మంత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నడి రోడ్డుపై ఒక జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్‌తో కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరు తనను విస్మయానికి గురిచేసిందన్నారు. రాజకీయ నాయకులు చేసే ఇలాంటి డ్రామాల వల్ల కష్టపడి పని చేసే ఐఏఎస్ ఆఫీసర్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ట్విటర్ ద్వారా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు చేసిన మంత్రి కేటీఆర్... కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కి అండగా నిలుస్తున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే...
ఇదిలావుంటే, కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నిర్మల.. రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోదీ ఫోటోలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌ని ఆదేశించిన సంగతి తెలిసిందే. బహిరంగ మార్కెట్ లో కిలోకు 30 - 35 పలికే బియ్యాన్ని ఒక్క రూపాయికే అందిస్తోందని చెప్పే క్రమంలో.. బియ్యం సరఫరాకు కేంద్రం ఇచ్చే సబ్సీడీకి తోడు రాష్ట్రం ఎంత వాటా ఇస్తుందో చెప్పాలని కలెక్టర్ ని ప్రశ్నించారు. 


అయితే, కేంద్ర మంత్రి అడిగిన ప్రశ్నకు కలెక్టర్ వెంటనే సమాధానం చెప్పలేకపోవడంతో.. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వి అయ్యుండి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా అని మందలించారు. కేంద్ర మంత్రి కలెక్టర్ ని ప్రశ్నించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇదే విషయంలో కేంద్రమంత్రి తీరును తప్పుపడుతూ మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌కి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman questioning Kamareddy Collector), బీజేపి శ్రేణులు ఏమని స్పందిస్తాయో వేచిచూడాల్సిందే మరి.


Also Read : Harish Rao: తెలంగాణే నిధులిస్తోంది.. కేంద్ర పథకాలకు కేసీఆర్ బొమ్మ పెట్టాలి! హరీష్ రావు కొత్త పాయింట్


Also Read : KCR PLAN: కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్.. ఒకే రోజున కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్.. సంచలనం జరగబోతోందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి