Harish Rao: తెలంగాణే నిధులిస్తోంది.. కేంద్ర పథకాలకు కేసీఆర్ బొమ్మ పెట్టాలి! హరీష్ రావు కొత్త పాయింట్

Harish Rao: తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కౌంటరిచ్చారు మంత్రి హరీష్ రావు.ప్రధాని ఫోటో  రేషన్  షాపులో పెట్టమని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పడం హస్యాస్పదమన్నారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఉందన్నారు. 

Written by - Srisailam | Last Updated : Sep 2, 2022, 04:05 PM IST
  • నిర్మలకు హరీష్ కౌంటర్
  • దేశాన్ని సాకే రాష్ట్రం తెలంగాణ
  • కేంద్ర పథకాలకు కేసీఆర్ బొమ్మ పెట్టాలి- హరీష్
Harish Rao: తెలంగాణే నిధులిస్తోంది.. కేంద్ర పథకాలకు కేసీఆర్ బొమ్మ పెట్టాలి! హరీష్ రావు కొత్త పాయింట్

Harish Rao: తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కౌంటరిచ్చారు మంత్రి హరీష్ రావు.ప్రధాని ఫోటో  రేషన్  షాపులో పెట్టమని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పడం హస్యాస్పదమన్నారు. ప్రధాని స్థాయిని దిగజార్చే విధంగా ఉందన్నారు.  ఎంతో మంది ప్రధానులు వచ్చారని.. రేషన్  షాపులో  ఎవరి ఫోటోలు పెట్టలేదన్నారు. గత చరిత్రలో లేని విధంగా తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా కేంద్ర మంత్రులు ప్రవర్తిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో కేంద్రం ఇచ్చే రేషన్ 55 శాతం మాత్రమేనని చెప్పారు. అది మూడు రూపాయలకు ఇస్తారని... అందులో  రెండు రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందన్నారు హరీష్ రావు. మిగతా 45 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించి లబ్ధిదారుడికి పది కేజీల బియ్యం ఇస్తుందని తెలిపారు.

కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు తెలంగాణ నుంచే ఎక్కువ డబ్బులు  వెళ్తున్నాయని హరీష్ రావు అన్నారు. కేంద్ర పథకాలకు సీఎం కేసీఆర్‌ బొమ్మ ఎందుకు పెట్టరని నిలదీశారు. నిర్మలా సీతారమన్ అన్ని అసత్యాలు మాట్లాడారని.. పార్లమెంట్ వేదికగా చెప్పింది ఆమెరు గుర్తులేదా అని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్రమే కాపీ కొట్టిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌లో చేరలేదని నిర్మలా సీతారామన్ పచ్చి అబద్దం చెప్పారన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ స్కీంలో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. చేరినట్లు తాము నిరూపిస్తే నిర్మలా సీతారామన్‌ రాజీనామా చేస్తారా అంటూ సవాల్‌ చేశారు. మాట్లాడిన అబద్దాలపై తప్పు ఒప్పుకుని కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు.

దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అన్నారు హరీష్ రావు. తెలంగాణ నుంచి పోయిన డబ్బులు ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి వెళుతుందన్నారు. 3 లక్షల 65 వేల 797 కోట్లు కేంద్రానికి పోతే.. అక్కడి నుంచి వచ్చింది  లక్షా 96 వేల 400 కోట్లు మాత్రమేనని చెప్పారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరం పారలేదని అన్నారని.. కాని నితిన్ గడ్కరీ  కాళేశ్వరం తెలంగాణ గ్రోత్ ఇంజన్ అని చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. జాతీయ స్థాయి నేతలు రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి అబద్దాలు చెప్పడం దారుణమన్నారు హరీష్ రావు.  బీజేపీ పాలనలో దేశం మొత్తం దివాళా తీసిందన్నారు హరీష్ రావు. కేంద్రం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రాల మీద బురద జల్లుతోందని విమర్శించారు. వరల్డ్ హంగర్ ఇండెక్స్ లో 2014లో 55 స్థానంలో ఉన్న భారత్.. 2022లో 101వ స్థానానికి పడిపోయిందన్నారు హరీష్ రావు.  

ఏ రంగంలో అయినా దేశ సగటు కన్నా తెలంగాణ రాష్ట్ర సగటు అన్ని రంగాల్లో ముందుందని చెప్పారు హరీష్ రావు.  ఏ సూచికలో చూసినా దేశ సగటు కన్నా తెలంగాణ మెరుగుగా ఉందన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా అమలు కావడం లేదంటున్న నిర్మలా సీతారామన్.. ప్రధానమంత్రి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఎందుకు అమలు కావడం లేదే చెప్పాలన్నారు.

Read also: No More Power Star: ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు.. ఎందుకో తెలుసా?

Read also:  మైండ్ బ్లాకింగ్ కాంబో.. ఒకే ఫ్రేమ్‌లో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, రష్మిక, త్రిష, దీపికా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News