KTR America Tour: కేటీఆర్ ఆమెరికా టూర్ సక్సెస్.. తెలంగాణకు రూ. 3315 కోట్ల పెట్టుబడులు
కేటీఆర్ ఆమెరికా పర్యటన సక్సెస్ అయిందనే చెప్పాలి. భారత్ లోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడులను ఆకర్శించడంలో తెలంగాణ ముందు ఉంటోంది. కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు విస్తరణకు సంపూర్ణంగా సహకరిస్తామని కేటీఆర్ భరోసానిచ్చారు.
KTR America Tour: మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన సక్సెస్ అయింది. పెట్టుబడులే లక్ష్యంగా అగ్రరాజ్యం వెళ్లిన ఆయన భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలను ఒప్పించారు. ఒకే రోజు రాష్ట్రానికి రూ.3,315 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. స్లేబ్యాక్ ఫార్మా, అడ్వెంట్ ఇంటర్నేషనల్, క్యూరియా గ్లోబల్, యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ ఆదివారం సమావేశమై చర్చలు జరిపారు.
ముందుగా న్యూయార్క్‌లో ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో అనుకూలతల దృష్ట్యా ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జెనరిక్ రంగంలో అగ్రగామిగా ఉన్న స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈవో అజయ్‌సింగ్ భేటీ అయ్యారు. ఈ భేటీ సక్సెస్ అవడంతో రానున్న మూడేళ్లలో హైదరాబాద్ లో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ అంగీకరించింది.
ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ యూఎస్ ఫార్మాకోపియా ముఖ్య ఆర్థిక అధికారి స్టాన్ బుర్హాన్స్, సీనియర్ ఉపాధ్యక్షుడు రీజియన్స్, స్ట్రాటెజీ, మెయింటెనెన్స్ ఆఫీసర్ కేవీ సురేంద్రనాథ్‌లు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా జినోమ్ వ్యాలీలో రూ.15 కోట్లతో ఔషధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ముందుకొచ్చారు.
గత ఏడేళ్ల కాలంలో అనేక అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్ కు తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా అంతే వేగంతో పెట్టుబడులను ఆకర్శింస్తోంది. భారత్ లోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడులను ఆకర్శించడంలో తెలంగాణ ముందు ఉంటోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రభాగాన నిలుస్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు విస్తరణకు సంపూర్ణంగా సహకరిస్తామని కేటీఆర్ భరోసానిచ్చారు.
Also read: PVR-Inox Mega Merger: మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో మెగా విలీనం... ఒక్కటైన పీవీఆర్, ఐనాక్స్
Also read: Ola E-scooter Fire: ఓలా ఈ-స్కూటర్లో మంటలు- వైరల్ అవుతున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook