MLA KP Vivekananda: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. సామాన్య ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, నాయకుల సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు, మంత్రికి కరోనా సోకగా.. తాజాగా కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ( TRS ) ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ ( KP Vivekananda ) కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. Also read: Telangana: టెన్త్, ఇంటర్ పాస్.. ఆపై డాక్టర్లుగా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ విషయాన్ని మేడ్చల్ డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ తెలిపారు. ఎమ్మెల్యే వివేకనంద్ కుటుంబసభ్యులకు కూడా టెస్టులు చేయగా.. ఎమ్మెల్యే భార్య, కుమారుడు, పనిమనిషికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.  అయితే వారిని హోం క్వారంటైన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉన్న వారికి కూడా టెస్టులు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. Also read: AP: కరోనాతో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి కన్నుమూత


తెలంగాణలో  ఆదివారం కొత్తగా 1,296 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,076కి చేరింది. మృతుల సంఖ్య 415కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 మంది చికిత్స పొందుతుండగా..  ఇప్పటివరకు 32,438 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.   Also read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా