L Ramana joins TRS party: టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ రమణ
L Ramana joins TRS party ahead of Huzurabad bypolls: హైదరాబాద్: తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే టీటీడీపీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఎల్ రమణ.. సోమవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
L Ramana joins TRS party ahead of Huzurabad bypolls: హైదరాబాద్: తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే టీటీడీపీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఎల్ రమణ.. సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన రమణకు మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. ఈ నెల 16న హుజురాబాద్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో ఎల్ రమణ పార్టీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది.
Also read : Huzurabad bypolls: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో (Minister Errabelli Dayakar Rao) కలిసి వెళ్లి ఇటీవలే ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎల్ రమణ (L Ramana).. సామాజిక తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి (CM KCR about L Ramana) తనను పార్టీలోకి ఆహ్వానించారని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also read : Ys Jagan Review: కోవిడ్ నివారణ చర్యలపై వైఎస్ జగన్ సమీక్ష, కర్ఫ్యూ వేళల్లో మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook