land price in Hyderabad: తెలంగాణలో మరోసారి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్​లో భూముల ధరలు రికార్డు స్థాయిలో (Land value in Hyderabad) పెరిగాయి. ఇటీవలే తెలంగాణ వ్యాప్తంగా భూముల మార్కెట్ ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఇందుకు కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యవసాయ భూముల మార్కెట్ విలువను అత్యధికంగా 50 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం (Land Market Value in TS) గమనార్హం.


హైదరాబాద్​లో కొత్త ధరలు ఇలా..


హైదరాబాద్​లో సాధారణంగానే భూముల భారీగా ఉంటాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ధరలు మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్​ పరిధిలోని పలు మండలాల్లో ఎకరా భూమి ధర రూ.24.22 కోట్లు దాటింది. ఇంతకు ముందు ఇక్కడ ఎకరా ధర రూ.22.2 కోట్లుగానే ఉండటం గమనార్హం. సరూర్​ నగర్​ సహా చుట్టు పక్కల మండలాల్లో ఈ స్థాయిలో రేట్లు (land price in Saroornagar) ఉన్నాయి.


ఇక కూకట్ పల్లి, బాలానగర్​, మూసాపేట్ వైపు ఎకరాం భూమి (land price in kukatpally) ధర రూ.18.87 కోట్లు పలుకుతోంది. మాదాపూర్​లో ఇంతకు ముందు ఉన్న దానితో పోలిస్తే.. ప్రస్తుత ధర 10 శాతం పెరిగింది.


జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యల్పంగా నాగోల్​, బండ్లగూడ వైపు ఎకరాం భూమి ధర రూ.5.03 కోట్లుగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో అత్తాపూర్​ వైపు రూ.6.30 కోట్లుగా ఉంది. (ధరలన్నీ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.)


పెరగనున్న ఛార్జీలు..


భూముల ధరలతో పాటు.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి రానున్నాయి. పాత ఛార్జీలతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నేడు, సోమవారం మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రిజిస్ట్రేషన్ ఆఫీసుల వద్ద చాలా మంది బారులు తీరారు.


Also read: Hyderabad Sex racket: హైదరాబాద్​లో మరో సెక్స్​ రాకెట్​- గెస్ట్​ హౌస్​లో దందా!


Also read: Darshanam Mogilaiah: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ రూ.1 కోటి నజరానా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook