Hyderabad Sex racket: హైదరాబాద్​లో మరో సెక్స్​ రాకెట్​- గెస్ట్​ హౌస్​లో దందా!

Hyderabad Sex racket: హైదరాబాద్​లో మరో వ్యభిచార మఠా గట్టు రట్టు చేశారు పోలీసులు. గచ్చిబౌలి పరిధిలో ఈ ముఠాన నిర్వహిస్తున్న వారిని అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 01:36 PM IST
  • గచ్చిబౌలిలో హైటెక్ వ్యభిచారం
  • గెస్ట్​ హౌస్​లో గట్టుచప్పుడు కాకుండా దందా
  • పలువురి అరెస్ట్​, ఇద్దరు యువతుల రెస్క్యూ!
Hyderabad Sex racket: హైదరాబాద్​లో మరో సెక్స్​ రాకెట్​- గెస్ట్​ హౌస్​లో దందా!

Hyderabad Sex racket: హైదరాబాద్​లో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు కొంత మంది. ఇటీవలే మాదాపూర్​లో మసాజ్​ సెంటర్​ పేరుతో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేసిన ఘటన మరవక ముందే.. మరో కొత్త ముఠా గుట్టు (Prostitution in Hyderabad) రట్టయింది.

గచ్చిబౌలిలో ముఠా అరెస్ట్​..

గచ్చిబౌలి పోలీస్టేషన్​ పరిధిలో ఉన్న ఓ లగ్జరీ గెస్ట్​ హౌస్​లో ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వినాయక నగర్​లో ఉన్న శ్రీ వినాయక లగ్జరీ గెస్ట్ హౌస్​లో జరగుతున్న వ్యభిచార గృహాన్ని పోలీసులు తాజాగా.. గుర్తించి నింధితులను అదుపులోకి (Prostitution in Gachibowli) తీసుకున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆ గెస్ట్ హౌస్ ఓనర్​కు తెలియకుండా అందులో పని చేసే ఓ వ్యక్తే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి కూడా కొంత మంది వ్యభిచార దందా నిర్వహించే వారికి గెస్ట్ హౌస్ అద్దెకిస్తూ.. ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్లు (Sex racket in Guest house) వెల్లడైంది.

గెస్ట్​ హౌస్​పై దాడి చేసిన పోలీసులు ఇద్దరు యువతులను కాపాడారు. ఈ దందా నిర్వహిస్తున్న పలువురుని అరెస్ట్ చేశారు. మరికొంత మంది పారారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారికోసం గాలిస్తున్నట్లు వివరించారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

నగరంలో ఇటీవల పెరిగిన వ్యభిచార దందాలు పెరిగిపోతున్నాయి. పబ్​లు, మసాజ్​ సెంటర్లు, గెస్ట్​ హౌజ్​ల పేరుతో దందాలకు పాల్పడుతున్నారు (Hitech Prostitution) కొంతమంది.

Also read: Telangana Schools Re Open: నేడు అధికారిక ప్రకటన.. స్కూళ్ల రీఓపెన్‌ ఎప్పుడో తెలుసా?

Also raed: Darshanam Mogilaiah: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ రూ.1 కోటి నజరానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News