Santosh Babu Funeral | దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు (Last Rites Of Santosh Babu) అధికార లాంఛనాలతో జరిగాయి. సంతోష్ బాబు నివాసం నుంచి కేసారంలోని వారి వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర జరగగా.. భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వీరుడికి తుది నివాళులు అర్పించారు. కేసారంలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ, సైనిక లాంఛనాల నడుమ సంతోష్ బాబుకు తండ్రి దహన సంస్కారాలు నిర్వహించారు. ఎటు చూసినా ‘సంతోష్ బాబు అమర్ రహే’ నినాదాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం 50 మందికి అంత్యక్రియల ప్రదేశానికి అనుమతి ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, సైనికాధికారులు, పోలీసులు, ఉన్నతాధికారులు కొందరు మాత్రమే భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సంతోష్ బాబు చితికి తండ్రి అశ్రు నయనాల మధ్య నిప్పంటించి దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారుడికి తుది  వీడ్కోలు పలికారు. కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం చూసి కుప్పకూలిన తల్లి, భార్య 



అంతకుముందు కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ సెంటర్, మీదుగా కోర్టు జంక్షన్, ఎస్పీ ఆఫీసు నుంచి కేసారంలోని వారి వ్యవసాయ క్షేత్రం వరకు దాదాపు ఆరు కి.మీ మేర సాగింది. అమరవీరుడి అంతిమయాత్ర(Last Journey Of Santosh Babu)లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కల్నల్ సంతోష్ బాబు అమర్ రహే, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలతో రోడ్ల మీదకు వచ్చారు. సంతోష్ బాబు పార్థీవ దేహంపై పూలు చల్లుతూ వీరుడికి తుది నివాళి అర్పించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ