Legal notice to Revanth Reddy in Minister KTR's defamation suit: హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన విచారణకు తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. తన పేరుని సదరు కేసు దర్యాప్తునకు ముడిపెడుతూ ఆరోపణలు చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో డిఫేమేషన్ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ నేడు కోర్టులో విచారణకు రాగా.. మంత్రి కేటీఆర్ తరపు అడ్వకేట్ తన వాదనలు వినిపించి అందుకు తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి కేటీఆర్ (Minister KTR) తరపు న్యాయవాది వాదనలు విని, సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం డ్రగ్స్ కేసు విషయంలో రేవంత్ రెడ్డి కాని, లేదా ఆయన తరపు వ్యక్తులు కానీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయరాదని ఆదేశిస్తూ కోర్టు ఇమ్మిడియెట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. 


Also read : MLA Seethakka health condition: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు..


మంత్రి కేటీఆర్‌కి సంబంధం లేని ఈ వ్యవహారంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేదా సోషల్ మీడియాలో ఆయన పేరుని ప్రస్తావించడానికి వీల్లేదని కోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు (Legal notice to Revanth Reddy) జారీ చేస్తూ తర్వాతి విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది.


Also read : KTR Vs Revanth: కేటీఆర్‌ వర్సెస్‌ రేవంత్‌ ట్వీట్‌ వార్.. డ్రగ్స్‌ పరీక్షలపై విసిరిన వైట్‌ ఛాలెంజ్‌పై రచ్చరచ్చ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook