Advocates couple Vaman Rao, PV Nagamani Murder case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, నాగమణి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దుల్లోని వాంఖిడి-చంద్రపూర్ ప్రాంతంలో నిందితుల కదలికలు గుర్తించిన పోలీసులు అక్కడే వారిని అదుపులోకి తీసుకుని పెద్దపల్లికి తరలించారు. అనంతరం ఆ ముగ్గురు నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను పెద్దపల్లి ఏసీపీ ఆఫీసులో ఐజి నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. న్యాయవాద దంపతుల జంట హత్య కేసులో A1 గా కుంట శ్రీను, A2 గా శివందుల చిరంజీవి, A3 అక్కపాక కుమార్ పేర్లు ఎఫ్ఐఆర్‌లో నమోదయ్యాయి. IPC sections 21/2021 U / s 302, 341,120-B r / w 34 కింద నిందితులపై కేసు నమోదైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హత్యకు గురైన వామనరావు దంపతులు సహా వారి హత్యలో పాల్గొన్న నిందితులు అందరూ గుంజపడుగు గ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. Vaman Rao's father Kishan Rao ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు FIR నమోదు చేశారు. న్యాయవాద దంపతుల జంట హత్యకు ఉపయోగించిన బ్లాక్ కలర్ వితారా బ్రెజ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


Also read : Visakhapatnam land scam: విశాఖ భూకుంభకోణమంతా ఆ 126 ఎన్ఓసీలపైనే, కొనసాగుతున్న సిట్ దర్యాప్తు


రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సబ్-డివిజన్‌లోని రామగిరి జోన్‌లో కల్వచర్ల రోడ్డుపై పెట్రోల్ బంకుకి సమీపంలో బుధవారం మధ్యాహ్నం పట్టపగలే అందరూ చూస్తుండగానే వామనరావు-పీవీ నాగమణి దంపతుల హత్య (Lawyers couple murder case) జరిగింది. మంథనిలో జరిగిన ఓ ఫంక్షన్‌కి హాజరై హైదరాబాద్‌కి తిరిగి వస్తున్న క్రమంలోనే దంపతులు ఇద్దరూ దారుణ హత్యకు (Advocates couple murder case) గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఐజి నాగిరెడ్డి మీడియాకు తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook