హైదరాబాద్‌లో నడిరోడ్డుపై చిరుత కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ లో చిరుత కనిపించింది. ఉదయంపూట రోడ్డుపై చిరుత పడుకుని ఉండడాన్ని స్థానిక ప్రజలు గమనించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాటేదాన్ అండర్ బ్రిడ్జి వద్ద స్థానికులు చిరుతను గుర్తించారు. జాతీయ రహదారిపై గాయపడిన చిరుతను చూసి ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ, జూపార్కు సిబ్బంది  వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రహదారిపై రాకపోకలను నియంత్రించారు. చిరుతను జూపార్కుకు తీసుకెళ్లేందుకు అటవీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ చిరుతను బంధించేందుకు ప్రయత్నిస్తుండగా... అది ఓ వ్యక్తిని గాయపరిచింది. అనంతరం తప్పించుకుని దగ్గర్లోని రైల్వే గేటు పక్కనే ఉన్న తోటలోకి వెళ్లి అదృశ్యమైంది.


ప్రస్తుతం తోటలోనే ఉన్న చిరుతను పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.  తోట చుట్టూ ప్రహరి గోడ ఉంది. ఈ కారణంగా అది ఎక్కడికీ వెళ్లే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. చిరుతను పట్టుకుని 'జూ' కు తరలిస్తామంటున్నారు.   


మరోవైపు గత రాత్రి నుంచి గోల్కొండ ప్రాంతంలో చిరుత పులి  తిరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఐతే ఆ ప్రచారంలో నిజం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.  నిన్న రాత్రి నుంచి తిరుగుతున్నది  సివిట్ క్యాట్.. అంటే మాను పిల్లి  అనే జంతువు అని తెలిపారు.  స్థానికుల సమాచారంతో అటవీశాఖ వెంటనే స్పందించి ఇవాళ ఉదయం దానిని బంధించినట్లు వెల్లడించారు. 


ప్రస్తుతం మానుపుల్లిని  జూపార్కుకు తరలించామని చెప్పారు. తగిన రక్షణ చర్యలు తీసుకున్నామని జూపార్కులో దాని ఆరోగ్యాన్ని పరిశీలించిన మీదట తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.  స్థానికులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..