Forest Officers Catches Leopard: హైదరాబాద్‌: తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ (Hyderabad) శివార్లల్లో గ‌త కొంత‌కాలంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత పులి ( Leopard ) ఎట్ట‌కేల‌కు పట్టుబడింది. రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని వాలంత‌రి దగ్దర అటవీ అధికారులు ఏర్పాటుచేసిన బోనులో ఆదివారం తెల్లవారుజామున చిక్కింది. కొన్ని నెలలుగా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతంలో చిరుత సంచరిస్తూ.. ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలుమార్లు గొర్రెలు, పుశువుల మందపై దాడిచేసిన చిరుత.. తాజాగా శుక్రవారం రాత్రి వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ వ‌ద్ద ఓ ప‌శువుల‌ కొట్టంలో రెండు ఆవు దూడ‌ల‌పై దాడిచేసి చంపింది. దీంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు..  చిరుత‌ను పట్లుకునేందుకు వాలంతరి వ్యవసాయ క్షేత్రంలో బోన్లతోపాటు సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేసి.. చ‌నిపోయిన దూడ‌ల‌ను ఎర‌గా ఉంచారు. Also read: Amitabh Bachchan: 78వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ షెహన్‌షా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో శనివారం రాత్రి ఈ ప్రాంతంలో సంచరించిన చిరుత.. దూడ‌ల‌ కోసం వ‌చ్చి తెల్లవారుజామున 4గంటలకు బోనులో చిక్కింది. అయితే.. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతంలో రెండు వారాల కొకసారి కనిపిస్తూ.. భయాందోళనకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బోనులో చిక్కిన చిరుతను అటవీ అధికారులు నెహ్రూ జువాలాజికల్‌ పార్కుకు తరలించారు.  


Also read : China on coronavirus: కరోనావైరస్ పుట్టింది చైనాలో కాదు: చైనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe