Liquor sales in Telangana: కొత్త సంవత్సరం నాడు ఎంత మద్యం తాగారో తెలుసా ?
2021 నూతన సంవత్సరం వేడుకలను ( New Year 2021 celebrations ) పురస్కరించుకుని ప్రభుత్వం మద్యం దుకాణల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరిగాయి.
Alcohol sale in Telangana: హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం ప్రియులు డిసెంబర్ 31 నాడు మస్తు మజా చేసుకున్నారనడానికి నిదర్శనంగా రాష్ట్రవ్యాప్తంగా ఆ ఒక్కరోజే రూ.194 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. సాధారణంగా అయితే మిగతా రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున రూ.70 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరిగితే.. డిసెంబర్ 31న మాత్రం అసాధారణంగా మూడు రెట్ల వరకు అధికంగా మద్యం విక్రయాలు జరిగినట్టు సమాచారం అందుతోంది.
2021 నూతన సంవత్సరం వేడుకలను ( New Year 2021 celebrations ) పురస్కరించుకుని ప్రభుత్వం మద్యం దుకాణల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరిగాయి. ఈ కారణంగానే మద్యం అమ్మకాలు మూడురెట్లు పెరిగినట్టు లిక్కర్ షాప్స్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, ఒకవేళ కొవిడ్-19 లేకపోయి ఉండుంటే.. మద్యం అమ్మకాలు ( Liquor sales ) మరింత పెరిగేవి అంచనా మద్యం దుకాణదారులు ( Liquor shops ) ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Also read : Liquor Sales in Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook