Liquor Sales in Telangana: కొత్త కరోనా వైరస్ కేసులు నమోదువుతున్న నేపథ్యంలో పలు దేశాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధం, లేక పరిమితితో కూడిన ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కరోనా స్ట్రెయిన్ వైరస్‌ను గుర్తించారు. ఈ పరిణామాల మధ్య మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


హైదరబాద్(Hyderabad) నగరంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు ఇవ్వనప్పటికీ, డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచే ఉంటాయని అబ్కారీశాఖ తెలిపింది. రిసార్టులు, పబ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టామని, అయితే పబ్‌లు, క్లబ్‌లకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. బార్‌లు ఒంటి గంట వరకు తెరిచి ఉంచడానికి అనుమతులు ఇచ్చారు. వైన్స్ షాపులు, బార్‌ల వద్ద కోవిడ్-19 నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.


Also Read: Telangana ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు.. వేతనాల పెంపు, మరెన్నో నిర్ణయాలు



కాగా, నగరంలో వైన్స్ షాపులు, బార్లు, క్లబ్బులకు అనుమతి లేదని ఇటీవల సైబరాబాద్ సీపీ చెప్పడం తెలిసిందే. అయితే తెలంగాణ(Telangana) ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని సమకూర్చే మద్యంపై కాస్త ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో జిల్లాల్లో ఉన్న కొందరి ఆచూకీ కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. యూకే నుంచి వచ్చిన వారిలో కరోనా స్ట్రెయిన్ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.


Gallery: Iswarya Menon Photos: అందాల ‘ఐశ్వర్య’మా.. పరువాల పావురమా!



పండుగలు, వేడుకల కన్నా ప్రాణాలే ముఖ్యమని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender) మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. కొత్త వైరస్ భయంకరమైనది కాదని అలసత్వం ప్రదర్శించకూడదని, కచ్చితంగా నిబంధనలు పాటించాలని తెలంగాణ ప్రజలకు ఆయన సూచించారు. ప్రాణాలు తీసేంత ఎక్కువ శక్తి లేనప్పటికీ.. అతి వేగంగా స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి అవుతుందని హెచ్చరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook