Liquor Shops Hyderabad: మందుబాబులకు చేదువార్త! తెలంగాణ రాజధానికి హైదరాబాద్ లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అయితే అది ఒక్కరోజు మాత్రమే. శనివారం అనగా ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి కారణంగా హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్స్, బార్ లను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం అనగా ఏప్రిల్ 16న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 17 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఇదే విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ. ఆనంద్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. 


అయితే ఈ నిబంధనలు స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్స్ లోని బార్లకు వర్తించవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన హెచ్చరించారు. వీటిని బేఖాతరు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు. 


Also Read: VH house Attacked: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌ ఇంటిపై దాడి... అర్ధరాత్రి బీభత్సం సృష్టించిన దుండగులు


Also Read: Telangana Electricity: తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై కీలక ప్రకటన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook