Amit Shah Munugode Meeting: కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతాం..కేంద్రమంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్..!

Sun, 21 Aug 2022-7:08 pm,

Amit Shah Munugode Meeting: తెలంగాణలో మునుగోడు రాజకీయం హీట్ పుట్టిస్తోంది. బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరిగింది.

Amit Shah Munugode Meeting: కేసీఆర్ సర్కార్‌ని పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని కేంద్రమంత్రి అమిత్ షా చెప్పారు. కేసీఆర్ సర్కార్‌ని పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే..పొగ మాదిరిగా కేసీఆర్ సర్కార్ మాయమైపోతుందని విమర్శించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం చేస్తానని కేసీఆర్ చెప్పారు..కానీ అధికారంలోకి వచ్చాక విస్మరించారని మండిపడ్డారు.

Latest Updates

  • రాజగోపాల్‌ను గెలిపిస్తే..తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటాం
    బీజేపీ అధికారంలోకి వస్తే..దొడ్డు బియ్యం కొనుగోలు చేస్తాం
    కేసీఆర్ కుటుంబసభ్యులకు కాళేశ్వరం ఏటీఎం
    కేసీఆర్‌ది కుటుంబ పాలన: అమిత్ షా
    పవర్‌లోకి రాగానే విమోచన దినోత్సవం జరుపుతాం: అమిత్ షా

  • కేసీఆర్ సర్కార్‌ని పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు: అమిత్ షా
    కేసీఆర్ సర్కార్‌ని పడగొట్టేందుకు ఇది ఆరంభం
    రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే..పొగ మాదిరిగా కేసీఆర్ సర్కార్ మాయమైపోతుంది
    సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం చేస్తానని కేసీఆర్ చెప్పారు
    పవర్‌లోకి వచ్చాక ఆ హామీని విస్మరించారు: అమిత్ షా
    వచ్చే ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుంది: అమిత్ షా

  • కేసీఆర్ ఇచ్చే బీబీసీ తీసుకుని మోస పోవద్దు: విజయ శాంతి
    బీసీసీ అంటే బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ: విజయ శాంతి
    8 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్‌ చేసిందేమి లేదు
    పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఏవి: విజయ శాంతి
    కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి: విజయ శాంతి
    ఐటీ, సీబీఐ, ఈడీ వచ్చినా భయం లేదు: విజయ శాంతి

  • మునుగోడులో బీజేపీ బహిరంగ సభ 
    బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో చేరిక
    ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే బీజేపీలో చేరా: కోమటిరెడ్డి

  • వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారన్నది అవాస్తవం- అమిత్ షా

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    విద్యుత్ చట్టాలను మార్చే ప్రసక్తే లేదు- అమిత్ షా

    ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని అమిత్ షాకు సూచించిన రైతులు

     

  • రైతు సంఘాల ప్రతినిధులతో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    విద్యుత్ చట్టం కాదు.. ఇక్కడి ప్రభుత్వాన్ని మార్చాలి- అమిత్ షా

    ఫసల్ బీమా యోజన అమలు కాకపోవడంపై అమిత్ షా ఆగ్రహం

    సేంద్రీయ వ్యవసాయం చేయాలని రైతులకు సూచించిన అమిత్ షా

  • బేగంపేట ఎయిర్ పోర్టులో రైతు సంఘాల నేతలతో అమిత్ షా భేటీ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    తెలంగాణలో రైతు సమస్యలపై చర్చించిన అమిత్ షా

    మునుగోడు సభలో రైతు సమస్యలపై కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వనున్న అమిత్ షా

    వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారని నిన్న ఆరోపించిన కేసీఆర్

  • సాంబమూర్తి నగర్ లోని బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లిన అమిత్ షా

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    బీజేపీ కార్యకర్త నివాసంలో అల్పాహారం తీసుకున్న అమిత్ షా

    దళిత కార్యకర్త ఇంటినుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు అమిత్ షా

  • కేసీఆర్ అహంకారం దించేందుకే అమిత్ షా వచ్చారు- తరుణ్ చుగ్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    వామపక్ష పార్టీలు ఎక్కడున్నాయి- తరుణ్ చుగ్

    ఇవాళ చాలా మందిని అమిత్ షా కలవబోతున్నారు- తరుణ్ చుగ్

     

  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లిన కేంద్రమంత్రి అమిత్ షా

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అమిత్ షా

    అమిత్ షా వెంట కిషన్ రెడ్డి, బండి సంజయ్

  • హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    బేగంపేట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర బీజేపీ నేతలు

    అమిత్ షాకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

  • మునుగోడులో గ్యాస్ సిలిండర్ బెలూన్లతో కలకలం..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో మునుగోడుకు రానున్నారు. బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. మరోవైపు అమిత్ షా సభ ఉండగా మునుగోడులో గ్యాస్ సిలిండర్ బెలున్లు ఎగరడం కలకలం రేపింది. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఈ బెలూన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన వినూత్న బ్యానర్లను పోలీసులు తొలగించారు. “కాంగ్రెస్ హయాంలో నా ధర రూ.410.. బీజేపీ హయాంలో ఇప్పుడు నా ధర రూ. 1105.. నన్ను కొనే దమ్ముందా... వంట చేసేంత సీన్ ఉందా”  అంటూ బ్లానర్లు ఏర్పాటు చేశారు.

     

  • మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఆగస్టు 23న ఢిల్లీలో ప్రియాంక గాంధీ సమావేశం

    తెలంగాణ ముఖ్యనేతలకు ఢిల్లీకి రావాలని ఆదేశం

    పార్టీ అభ్యర్థి, ప్రచార వ్యూహంపై కీలక చర్చ

  • ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్‌ చేసిన ఆరోపణలకు మునుగోడు సభ వేదికగా అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చేలా బీజేపీ నేతలు అంతా సిద్ధం చేశారని తెలుస్తోంది.  మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఎంత ఖర్చు పెట్టింది? కేంద్ర సర్కార్ ఎన్ని నిధులు ఇచ్చింది అన్న వివరాలు వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకు సంబంధించి  ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించారు బీజేపీ నేతలు. వాటిని లెక్కలతో సహా సభా వేదికగా అమిత్ షా వివరించే అవకాశం ఉంది.

     

  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మునుగోడు టూర్ షెడ్యూల్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా

    2.10 సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లి అమ్మ దర్శనం

    2.40 సికింద్రాబాద్‌లోని బీజేపీ కార్యకర్త సత్యనారాయణతో అరగంట సమావేశం

    3.20 గంటలకు బేగంపేటలోని రమదా మనోహర్ హోటల్‌కు అమిత్ షా

    4 పీఎం  రైతు సంఘాల నేతలతో హోంమంత్రి అమిత్ షా సమావేశం

    4.10  బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు అమిత్ షా

    4.40 నుంచి 04.55 గంటల వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో సమావేశం

    5 గంటలకు మునుగోడులో జరిగే బహిరంగసభకు అమిత్ షా హాజరు

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించనున్న అమిత్ షా

    రోడ్డు మార్గం ద్వారా 6.50 నిమిషాల కు రామోజీ ఫిల్మ్ సిటీకి అమిత్ షా

    30 నిమిషాల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండనున్న అమిత్ షా

    7.20 నిమిషాలకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ నోవాటెల్ కు అమిత్ షా

    7.50 నిమిషాలకు నోవాటెల్ హోటల్ కు చేరుకోనున్న అమిత్ షా

    రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం

    మనుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం

    అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి అమిత్ షా

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link