AP, Telangana Weather IMD Live Updates: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్
AP, Telangana Weather IMD Live Updates: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్
AP, Telangana Weather IMD Live Updates: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. లైవ్ అప్‌డేట్స్
Latest Updates
IMD Hyderabad chief officer K Nagaratna: వాయువ్య దిశతో పాటు దానిని ఆనుకున్నటువంటి పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్రప్రదేశ్ తీరం వెంబడి 7.6 కిలో మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ద్రోణి కొనసాగుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చీఫ్ ఆఫీసర్ నాగరత్న తెలిపారు. ఈ వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే ఇంకొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్న వివరించారు.
Telangana Weather Report Live Updates: మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నలుమూలలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు ఈ భారీ వర్షాల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.
Hyderabad Weather Reports Live Updates: హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా కుండపోతగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also read : YSR Jayanthi 2022: వైఎస్ఆర్ జయంతి.. వైఎస్ఆర్‌కి ఎందుకంత ఫ్యాన్ ఫాలోయింగ్ ? వైయస్ఆర్ డెత్ మిస్టరీ ఏంటి ?
Also Read : YS Vijayamma: విజయమ్మ తప్పుకుందా.. తప్పించారా! ఇడుపాలపాయలో రాత్రి ఏం జరిగింది..?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook