Hyderabad Liberation day Live Updates : ఎంఐఎం రజాకార్ల పార్టీనే.. బీజేపీ అసలు మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీనే! సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్

Sat, 17 Sep 2022-3:51 pm,

Hyderabad Liberation day: సెప్టెంబర్ 17.. తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయిన రోజు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణ స్టేట్ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ 17న వచ్చింది. అయితే సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణలో వివాదాలు అలుముకున్నాయి.

Hyderabad Liberation day: సెప్టెంబర్ 17.. తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయిన రోజు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణ స్టేట్ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ 17న వచ్చింది. అయితే సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణలో వివాదాలు అలుముకున్నాయి. సెప్టెంబర్ 17న ఒక్కో పార్టీ ఒక్కోలా వేడుకలు నిర్వహిస్తోంది. కేంద్ర సర్కార్ తొలిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా జరుపుతోంది. పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. తెలంగాణ సర్కార్ జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఇక వామపక్షాలు విద్రోహ దినంగా పాటిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్సవం జరుపుతోంది. సెప్టెంబర్ 17 వేడుకలపై లైవ్ అప్ డేట్స్ ...

Latest Updates

  • సెప్టెంబర్ 17పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే విషయంలో కేసీఆర్ మాట తప్పారని అన్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా వేడుకలు జరపలేదన్నారు నారాయణ. తెలంగాణ పోరాటంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినా చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ వీరులను బీజేపీ హైజాక్ చేస్తుందని నారాయణ మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ ముమ్మాటికి రజాకార్ల పార్టీనే అన్నారు. దేశంలో బీజేపీకి అసలైన మిత్రపక్షం ఎంఐఎం పార్టీనే అని నారాయణ చెప్పారు. బీజేపీని గెలిపించేందుకు అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతున్నారని అన్నారు.

     

  • తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.  చైతన్యానికి నెలవు, విప్లవాలకు కొలవు.. తెలంగాణ. ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటిగడ్డ తెలంగాణ' అంటూ పవన్ ట్వీట్ చేశారు.విమోచన అనండి లేదా విలీనం అనండి.. ఈ రోజు మాత్రం చారిత్రాత్మక శుభ దినం అన్నారు. ప్రపంచంలోనే పేరు గాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ అని పవన్ కొనియాడారు. నిరంకుశ పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ తల్లి విముక్తి కోసం అసువులు ధారబోసిన వీరులకు ప్రణామాలు అర్పించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సుఖ, సంతోషాలతో ఉండాలని  పవన్‌ కల్యాణ్‌ ఆకాక్షించారు.

     

  • సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు- రేవంత్ రెడ్డి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    పటేల్  RSS ను నిషేధించారు- రేవంత్ రెడ్డి

    స్వతంత్ర పోరాటంలో,  తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర లేదు

     ఇతర పార్టీల అధ్యక్షులను దొంగిలించి చరిత్రలో స్థానం కల్పించుకోవాలని చూస్తోంది

    సాయుధ పోరాటాన్ని  వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తోంది

    హైదరాబాద్ తో పాటు గుజరాత్ లోని జూనిఘాడ్ విలీనం

    గుజరాత్ లో బిజేపీ వజ్రోత్సవాలు ఎందుకు నిర్వహించడం లేదు- రేవంత్ రెడ్డి

     

  • పచ్చని తెలంగాణలో కొన్ని మత తత్వ శక్తులు చిచ్చు పెడుతున్నాయని.. విద్వేషపు  మంటలతో  అశాంతిని సృష్టించేందుకు కుట్రలు చేస్తు్న్నాయని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరముందన్నారు. చరిత్రను వక్రీకరించి తెలంగాణను మలినం చేసే కుట్రలను అడ్డుకోవాలన్నారు. రెప్పపాటు కాలం ఆదమరిచినా.. విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు సీఎం కేసీఆర్.

     

  • తెలంగాణ ప్రజలను ఏకం చేసిన 14 ఏళ్లు పోరాటం చేశా

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    చిమ్మ చీకట్లనూ చీల్చుకుంటూ తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోంది

    దేశానికే తెలంగాణ రాష్ట్రం టార్చ్ బేరర్ గా నిలుస్తోంది

    అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి సాధిస్తోంది

    మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు దేశానికి ఆదర్శం

    తెలంగాణ ప్రస్తుతం దేశానికి అన్నపూర్ణగా మారింది

     

  • స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను తెలంగాణలో ఘనంగా నిర్వహించాం

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం

    యావత్ తెలంగాణ ప్రజల పోరాటంతోనే ప్రజాస్వామిక స్వేచ్ఛ

    కొమురం భీమ్, దొడ్డి కొమరయ్య సహసాలు మరిచిపోలేనివి- కేసీఆర్

    ఎందరో వీరులు తమ త్యాగాలతో చరిత్రను వెలిగించారు- కేసీఆర్

  • పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ సర్కార్ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    జాతీయ జెండా ఎగుర వేసిన సీఎం కేసీఆర్

    పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్

    అమరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళి

     

  • తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది- ఎమ్మెల్సీ కవిత

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    తెలంగాణ ప్రజల మధ్య విధ్వేషాలకు బీజేపీ కుట్రలు- కవిత

    స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏంటీ- కవిత

    తెలంగాణ చరిత్రను బీజేపీ హైజాక్ చేసే ప్రయత్నం- కవిత

    బీజేపీకి ఎన్నికల ఉత్సవాలు జరపడం అలవాటే- కవిత

  • తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సర్దార్ పటేల్ వల్లే తెలంగాణ ప్రజలకు విముక్తి కల్గిందన్నారు.  పటేల్ పోరాటంతోనే నిజాం తల వంచారన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది పోరాడారని చెప్పారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతోనే ఇన్నాళ్లు వేడుకలు జరపలేదన్నారు.

  • తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర పారా మిలిటరీ బలగాల పరేడ్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    తెలంగాణ విమోచన వేడుకలకు హాజరైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే

     

  • పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అమిత్ షా

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

    కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించిన అమిత్ షా

     

  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన వేడుకలు

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా

    పరేడ్ గ్రౌండ్ లో అమరవీరులకు అమిత్ షా నివాళి

    బలగాల గౌరవ వందనం స్వీకరించిన అమిత్ షా

  • తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా గన్ పార్క్ దగ్గర లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూల మాలలు వేసి  నివాళులు అర్పించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు., కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాజ్య సభ సభ్యులు ఓబీసీ మోర్చా లక్ష్మణ్.,మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి. ఎమ్మెల్యే  రఘునందన్ రావు.

     

  • జాతీయ సమైక్యత దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో జాతీయ జెండా ఎగుర వేశారు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర పోచారం శ్రీనివాస్ రెడ్డి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link