Godavari Floods LIVE: ధవళేశ్వరంలో 25 లక్షల క్యూసెక్కుల వరద.. భద్రాచలంలో శాంతించిన గోదారమ్మ
Godavari Flood: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రవహిస్తోంది.
Godavari Flood: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మేడిగడ్డ నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవళేశ్వరం వరకు గోదారమ్మ డేంజర్ బెల్స్ మోగిస్తూ ప్రవహిస్తోంది. అయితే ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలంలో క్రమంగా నీటిమట్టం తగ్గుతోంది. శనివారం ఉదయం ఆరు గంటలకు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 71.3 అడుగులకు చేరింది. 9 గంటలకు 71.8 అడుగులకు చేరింది. తర్వాత నుంచి తగ్గడం మొదలైంది. ఉదయం 11 గంటల వరకు గోదావరి నీటిమట్టం 70.8 అడుగలకు తగ్గింది. గంటకు ఒక అడుగు తగ్గుతోంది నీటిమట్టం. మరోవైపు పోలవరం దగ్గర వరద పెరుగుతోంది. స్పీల్ వే గేట్ల నుంచి 23 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరంలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి గోదావరి పరుగులు పెడుతోంది. ధవళేశ్వరంలో ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 24 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
Latest Updates
ధవళేశ్వరంలో గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం
మధ్యాహ్నాం మూడు గంటలకు 24.57 లక్షల క్యూసెక్కుల వరద
కోనసీమ లంక గ్రామాల్లోకి చేరుతున్న వరద నీరు
పునరావాస కేంద్రాల్లో 90 లంక గ్రామాల ప్రజలు
భద్రాచలంలో 69.9 అడుగులకు తగ్గిన నీటిమట్టం
ఇంకా జల దిగ్భందంలోనే భద్రాచలం పట్టణం
ధవళేశ్వరంలో గంటగంటకు పెరుగుతున్న వరద
మరో 24 గంటలు ధవళేశ్వరంలో హైఅలర్ట్
భద్రాచలంలో నీట మునిగిన పలు కాలనీలు
సుభాష్ నగర్ ముందు బాధితుల ఆందోళన
కరకట్టను పొడిగించాలని డిమాండ్
రేపు కొత్తగూడెం జిల్లాకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్
వరద బాధితులను పరామర్శించనున్న గవర్నర్ తమిళి సై
శనివారం రాత్రికి హైదరాబాద్ నుండి రైలులో కొత్తగూడెం చేరుకోనున్న గవర్నర్
రాత్రికి కొత్తగూడెంలో బస చేయనున్న తమిళిసై సౌందర్య రాజన్
ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని కొత్తగూడెం వెళుతున్న తమిళి సై
CM KCR AERIAL SURVEY: భారీ వర్షాలు, గోదావరి వరదలతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అపార నష్టం జరిగింది. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో సీఎం సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో సిఎం కేసీఆర్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొననున్నారు. సీఎం ఏరియల్ సర్వే కు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్ ను ఫైనల్ చేయనున్నది.
భద్రాచలంలో తగ్గుముఖం పట్టిన వరద
సాయంత్రానికి మరింత తగ్గే నీటిమట్టం
కాళేశ్వరం నుంచి భారీగా తగ్గిన ఇన్ ఫ్లో
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు మూసివేత
భద్రాచలంలో 71.9 అడుగులకు చేరిన నీటిమట్టం
భద్రాచలంలో క్షణక్షణం.. భయంభయం
మరో నాలుగైదు గంటలు ఆత్యంత కీలకం
సాయంత్రం నుంచి వరద తగ్గే అవకాశం
కాళేశ్వరంలో భారీగా తగ్గిన గోదావరి వరద
శుక్రవారం కాళేశ్వరంలో 28 లక్షల క్యూసెక్కుల వరద
శనివారం ఉదయం కాళేశ్వరంలో 16 లక్షల క్యూసెక్కులకు తగ్గిన వరద
శనివారం ఉదయం ఏడు గంటలకు భద్రాచలంలో 24.29 లక్షల వరద
ధవళేశ్వరం డ్యాం గేట్ల నుంచి 23.20 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో
మేడిగడ్డ నుంచి దిగువకు భారీగా తగ్గిన వరద
ప్రాణహిత, ఇంద్రావతి నుంచి తగ్గిన వరద
సాయంత్రానికి భద్రాచలానికి తగ్గనున్న ఇన్ ఫ్లో
గోదావరి వరదలో మునిగిన ఎటపాక
నీటిమ్టటం మరో అడుగు పెరిగితే పూర్తిగా జలమయం
పోలవరంలో 22 లక్షలు క్యూసెక్కులు దాటిన అవుట్ ఫ్లో