Telangana floods live updates: ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి : ఎమ్మెల్సీ కవిత

Thu, 14 Jul 2022-2:17 pm,

Kadem project floods live updates:నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో గత 24 గంటల్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ప్రాజెక్ట్ కెపాసిటీకి మించి వరద వస్తుండటంతో అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Kadem project floods live updates: తెలంగాణలో కుండపోత వర్షాలు కంటిన్యూ  అవుతున్నాయి. నిర్మల్ జిల్లా  కడెం ప్రాజెక్టు పరిధిలో గత 24 గంటల్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ప్రాజెక్ట్ కెపాసిటీకి మించి వరద వస్తుండటంతో అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 4 లక్షల 97 వేల 413 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను పూర్తిగా ఎత్తి 2 లక్షల 99 వేల 047 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్ట్ డిశ్చార్జ్ సామర్ధ్యం మూడు లక్షల క్యూసెక్కులు మాత్రమే. కెపాసిటీ కి మించి వరద వస్తుండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు కడెం ప్రాజెక్టుకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీగా వస్తున్న ఇన్ ఫ్లోతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో కడెం వాసులు వణికిపోతున్నారు.


 

Latest Updates

  • ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి - ఎమ్మెల్సీ కవిత 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై‌ సీఎం కేసీఆర్ గారు నిరంతరం సమీక్షిస్తూ, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు అందిస్తూ కుటుంబ పెద్దలా అండగా నిలుస్తున్నారు - ఎమ్మెల్సీ కవిత 

    ప్రసవానికి వారం గడువున్న గర్భిణులకు కూడా ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, వరద ప్రాంతాల్లో వైద్య, విద్యుత్, త్రాగునీటి వసతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు - ఎమ్మెల్సీ కవిత 

    ఒక వైపు ప్రభుత్వం మరోవైపు టిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం ఎక్కడికక్కడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటు, ఆహార పంపిణీ చేస్తూ ప్రజలకు ధైర్యాన్నిస్తున్నారు - ఎమ్మెల్సీ కవిత 

    ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి - ఎమ్మెల్సీ కవిత

  • ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. మూడోవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గ్రామాలలో చాటింపు చేస్తున్నారు. ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి జలదిగ్బంధంలో ఉన్న గ్రామాల  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

  • ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతమైన దొడ్ల గ్రామం వద్ద దయ్యాల వాగుపై నిర్మించిన బ్రిడ్జి అకాల వర్షాలకు కుంగిపోయింది. నాలుగు గ్రామాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
     

  • నిన్న దక్షిణ ఒడిశా తీరం పరిసర ప్రాంతాల్లో కొనసాగిన తీవ్రఅల్పపీడనం ఈరోజు బలహీనపడింది.

    ఇవాళ ఉదయం 5:30 నిమిషాలకు తీవ్ర అల్పపీడనం నుంచి అల్పపీడనంగా బలహీనపడింది

  • ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగోల్లగూడెం గ్రామం నాలుగు రోజుల నుంచి జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.  బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

  • కడెం ప్రాజెక్టు కు తగ్గిన వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు  ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు వాటర్ ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండి.. అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళన పడ్డారు. ప్రస్తుతానికి వరద తగ్గడంతో ప్రమాదం తప్పింది. 

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటీ ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మానవ ప్రయత్నాలు అన్ని చేశామని, ఎట్టకేలకు వర్షాలు తగ్గడంతో  పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. 

    ప్రజలు ఆందోళన చెందవద్దని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.  ప్రస్తుతానికి ప్రాజెక్ట్ సేఫ్ జోన్ లో ఉందని తెలిపారు.... వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు కాగ... ఔట్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు. మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నామన్నారు.

     

  • తప్పిన ముప్పు

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    కడెం ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉధృతి

    ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు

    డ్యాంను  కాపాడేందుకు మానవ ప్రయత్నాలన్నీ చేసాం

    ప్రస్తుతానికి డ్యాం సేఫ్ జోన్ లో ఉంది

    సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • గోదావరిఖని-మంచిర్యాల బ్రిడ్జి పైకి వరద నీరు.. వాహనాల రాకపోకలు నిలిపివేత..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంచిర్యాల రహదారిలోని వంతెనల మీదుగా గోదావరి నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు గోదావరిఖని బస్టాండ్ వద్దే వాహనాలను నిలిపివేస్తున్నారు. ఈ బ్రిడ్జిపై భారీగా నీరు వచ్చి చేరడంతో నాగ్ పూర్, మంచిర్యాల ప్రాంతాలకు కరీంనగర్ జిల్లా మీదుగా వెల్లే పరిస్థితి లేకుండా తయారైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు వాహనాలను నిలువరించడంతో వందల సంఖ్యలోవాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గోదావరిఖనిలోని ఉదయ్ నగర్, సప్తగిరి కాలనీ, రెడ్డికాలనీల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో స్థానికులకు పునరావాస కేంద్రాల్లోకి తరలించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.

    1995 ప్రాంతంలో వచ్చిన వరదల సమయంలో గోదావరిఖని వంతెన మీదుగా వరద నీరు ప్రవహించిందని ఆ తరువాత ఇప్పుడే ఆ స్థాయిలో వరదలు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. కరీంనగర్ సమీపంలోని దుబ్బపల్లి వద్ద కూడా భారీగా వరద నీరు రాజీవ్ రహదారి మీదుగా ప్రవహిస్తుండడంతో బుధవారం రాత్రి నుండే కరీంనగర్ నుండి వాహనాల రాకపోకలను నిలువరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రంగంపల్లి వద్ద కూడా వరద ఉధృతి యథావిధిగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. చుట్టు పక్కల నివాసలు కూడా జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. 

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    రికార్డు స్థాయిలో పోటెత్తిన వరద..

    మేడిగడ్డ బ్యారేజీకి 18,52,390 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

    మొత్తం 85 గేట్లు ఎత్తిన అధికారులు 

    అన్నారం బ్యారేజీ 13,25,076 క్యూసెక్కుల వరద..

    తుపాకులగూడెం బ్యారేజీ నుంచి  16,50,000 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

     కాళేశ్వరం,ఏటూరునాగారం ప్రమాద హెచ్చరికల జారీ..

     

  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175  టీఎంసీలు

    ప్రస్తుత నీటి నిల్వ 15.3526 టీఎంసీలు

    148  అడుగుల గాను 145.20 అడుగులకు చేరిన వరద నీటి మట్టం .

    ఇన్ ప్లో  12,89,907 క్యూసెక్కులు

    ఔట్ ప్లో 13,10,935క్యూసెక్కుల  

    55  గేట్లు ఎత్తిన అధికారులు

    ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది 

  • గోదావరి వరద ఉధృతి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద  పెరుగుతున్న వరద ప్రవాహం 

    ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.52 లక్షల క్యూసెక్కులు

    సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం

    స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్  నుంచి  పర్యవేక్షిస్తున్న  విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ 

    సహాయక చర్యల్లో 7 ఎన్డీఆర్ఎఫ్, 5ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

    అల్లూరి జిల్లాలో 4, అంబేద్కర్ కోనసీమలో 3,  ఏలూరులో 2, తూర్పుగోదావరి లో 1, పశ్చిమగోదావరి లో 2 బృందాలు 

    గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని హెచ్చరిక జారీ.
     

  • కడెం ప్రాజెక్ట్ బ్రేక్ అయినట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు..

    అవన్నీ అవాస్తవమంటూ కొట్టిపారేసిన అధికారులు.. ఆ వీడియోలు ఫేక్ అని వెల్లడి

  • వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. నిర్మల్ జిల్లాలో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే జరిగితే కడెం ప్రాజెక్టుకు మరింత వరద పోటెత్తుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి వరదతో కడెం ప్రాజెక్టు నుంచి ముప్పు పొంచి ఉన్న సంగతి తెలిసిందే. మరింత వరద పెరిగితే పరిస్థితేంటన్న ఆందోళన నెలకొంది.

  • Andhra Pradesh Rain Updates: గోదావరి నదిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో  15.07 లక్షల క్యూసెక్కులుగా ఉంది. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ పర్యవేక్షణలోని అధికారుల బృందం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. వరద ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు. 

    గురువారం సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా మూడో ప్రమాదహెచ్చరిక జారీ చేసినట్టయితే.. అది ఏయే ప్రాంతాలు, మండలాలపై ప్రభావం చూపుతుందో ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు ముందుగానే అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. సహాయక చర్యల్లో ప్రస్తుతం మొత్తం 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరో 4 ఎస్డీఆర్ఎఫ్  బృందాలు కలిసి పనిచేస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది.

  • Yellampally Project live updates: ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు ఔట్ ఫ్లో విషయానికొస్తే.. కడపటి వార్తలు అందే సమయానికి ప్రాజెక్టు నుంచి 11.58 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వదులుతున్నారు. 50 గేట్లు ఎత్తి 11.58 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి నదిలోకి వదులుతుండగా.. హెచ్ఎండబ్లూఎస్ నుండి 275 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. గూడెం పంప్ హౌజ్, ఎన్టీపీసీ పంప్ హౌజ్, వేమునూరు పంప్ హౌజ్, నంది పంప్ హౌజ్‌ల నుంచి నీరు విడుదల చేయడం లేదు. 

  • Sripada Yellampally Project: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా.. బుధవారం నాడు రాత్రి 8 గంటల సమయానికి 145.90 మీటర్ల స్థాయికి చేరింది. ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 14.6499 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం ప్రాజెక్టులోకి ప్రస్తుతం వచ్చి చేరుతున్న ఇన్‌స్టాంట్ ఇన్‌ఫ్లో 11.89 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతానికి పార్వతి పంప్ హౌజ్ నుంచి ఇన్‌ఫ్లో ఏమీ లేనప్పటికీ.. క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి 11.89 లక్షల క్యూసెక్కులతో వరద నీరు ప్రాజెక్టును ముంచెత్తుతోంది.

  • కడెం ప్రాజెక్టు తెగిందా..డ్యాం బ్రేక్ అయిందా
    పుకార్లతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయవద్దంటున్న అధికారులు

    కడెం ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. డ్యాంలో నీటిమట్టం 7.3 టీఎంసీలు దాటి ప్రవహిస్తోంది. కడెం గ్రామంలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు కడెం ప్రాజెక్టు తెగినట్టు..డ్యాం బ్రేక్ అయినట్టు వార్తలు ప్రచారమౌతున్నాయి. ఈ వార్తల్ని అధికారులు ఖండించారు. డ్యాం బ్రేక్ వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. 

  • కడెం ప్రాజెక్టు ముంపు గ్రామాల తరలింపు

    కడెం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతున్నందున..దిగువకు నీటిని విడుదల చేస్తున్నకారణంగా ముంపునకు గురవుతున్న 12 గ్రామాల ప్రజలు అధికారులు ఖాళీ చేయించారు. కడెం ప్రాజెక్టు వద్దే ఉండి రక్షణ, సహాయక చర్యల్ని చేపట్టాలని మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. నిర్మల్ సహా..వరద ముంపుకు గురవుతున్న నదీ పరివాహక ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

  • కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ డ్యామేజ్
    నిండుతున్న కడెం ప్రాజెక్టు
    కడెం గ్రామంలో చేరుతున్న వరద నీరు

    భారీ వరద కారణంగా కడెం ప్రాజెక్టుకు ముప్పు శాతం పెరుగుతోంది. ఇప్పటికే నీటమట్టం 7.3 టీఎంసీలు దాటేసింది. మొత్తం సామర్ధ్యం 7.6 మాత్రమే. గేట్లపై నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఇప్పటికే కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ దెబ్బతింది. కడెం గ్రామంలోకి వరద నీరు చేరుతోంది. 

  • కడెం ప్రాజెక్టులో మరింత పెరిగిన నీటిమట్టం
    ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    కడెం ప్రాజెక్టు నీటి మట్టం ఇంకా పెరిగింది. 7.3 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. కడెం ప్రాజెక్టు పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

    రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు వదిలి..ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. 

  • కడెం ప్రాజెక్టుకు తప్పని ముప్పు

    కడెం ప్రాజెక్టుకు తప్పని ముప్పు. ఎగువ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులో ఇన్‌ప్లో ఇంకా పెరుగుతోంది. ప్రస్తుతం 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 17 గేట్లు తెరిచి దిగువకు వరద నీరు వదులుతున్నారు. ఇదే పరిస్థితి గతంలో 95 ఏళ్ల క్రితం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. దిగువ ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

  • ప్రమాదకర స్థాయికి కడెం ప్రాజెక్టు

    కడెం ప్రాజెక్టు ప్రమాదకరస్థాయికి చేరుకుంటోంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో ప్రస్తుతం 4 లక్షల 97 వేల క్యూసెక్కులుంది. అవుట్ ఫ్లో 2 లక్షల 97 వేల క్యూసెక్కులుంది. కడెం ప్రాజెక్టు పూరి సామర్ధ్యం 7.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7. 2 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. 

  • రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. మరో రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ బాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం , మహబూబా బాద్ , వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

     

  • కడెం ప్రాజెక్ట్ దగ్గర కాస్త టెన్షన్ తగ్గింది. ఎడమ కాలువ వైపు ఉన్న మైసమ్మ ఆలయం వద్ద గండి కొట్టి కొంత వరదను అటునుంచి పంపించారు, అంతకు ముందు ఎగువ నుంచి వస్తున్న వరద ఎక్కువగా ఉండగా.. అవుట్ ఫ్లో తక్కువగా ఉంది. అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో దాదాపు రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువగా ఉండటంతో అధికారులు ఆందోళనకు లోనయ్యారు. అయితే  మైసమ్మ ఆలయం వద్ద గండి కొట్టడంతో  వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో మూడున్నర లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 17 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. కడెం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తగ్గడంతో డ్యాంకు వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

  • కడెం ప్రాజెక్ట్ దగ్గర కాస్త తగ్గిన టెన్షన్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    5 నుంచి 4 లక్షల క్యూసెక్కులకు తగ్గిన వరద

    ప్రాజెక్టుకు ముప్పు తప్పిందంటున్న అధికారులు

    కడెం పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రి ఇంద్రకరణ్

     

  • ఇంకా డేంజర్ జోన్ లోనే కడెం ప్రాజెక్ట్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    కొనసాగుతున్న ఐదు లక్షల క్యూసెక్కుల వరద

    1995 తర్వాత ప్రమాదకరస్థాయిలో వరద

    భయం గుప్పిట్లో 25 గ్రామాల ప్రజలు

     

  •  

  • కడెం ప్రాజెక్ట్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ప్రాజెక్ట్ దగ్గరే ఉండి పరిశీలిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్ లో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కడెం ముంపు గ్రామాలైన కడెం, కన్నపూర్, దేవునిగూడెం, రాపర్, మున్యాల్, గొడిషిరియల్ గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు. NDRF బృందాల సాయం కోరారు ఎమ్మెల్యే రేఖానాయక్.

  • కడెం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో గత 24 గంటల్లో కుండపోతగా వర్షం కురిసింది. కొమరం భీమ్ జిల్లా జైనూరులో రికార్డ్ స్థాయిలో 39 సెంటిమీటర్ల వర్షం కురిసింది.  కెరిమెరిలో 38, సిర్పూరులో 35 సెంటిమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో 29, ఎలగైడ్ 25 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. కడెం ప్రాజెక్టులు ప్రస్తుతం ఐదు లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్ట్ మొత్తం 17 గేట్లు ఎత్తేశారు. అయితే ప్రాజెక్ట్ డిశ్చార్జ్ సామర్ద్యం ౩ లక్షల క్యూసెక్కులు మాత్రమే. దీంతో ఇరిగేషన్ అధికారులు చేతులెత్తేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదను తగ్గించడం కుదరదు కాబట్టి.. సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. కడెం ప్రాజెక్టుకు 1995లోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు ఊహించని వరద రావడంతో ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. కడెం గ్రామాన్ని వరద ముంచెత్తింది. అధికారుల హెచ్చరికలతో స్థానికులు గ్రామాన్ని వదిలి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారు.

  • కడెం ప్రాజెక్టు ప్రాజెక్ట్ పరిస్థితి పై ఇరిగేషన్ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే వివరణ ఇచ్చారు. కడెం డ్యాం డిశ్చార్జ్ సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు. అన్ని గేట్లు ఓపెన్ చేసి పెట్టారు. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు మించి వస్తుంటే ఫ్లడ్ మేనేజ్ మెంట్ చేయడం ఎవరికీ  కుదరదన్నారు. కాబట్టి డిసాస్టర్ మేనేజ్ మెంట్ కు సిద్ధపడటం తప్ప వేరే మార్గం లేదన్నారు. ఈ పరిస్థితి 1995 లో కూడా ఎదురయ్యింది అని ఇంజనీర్లు చెప్పారు. చిన్నపాటి నష్టాలతో ఆనాడు ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలపారు. ఇది అసాధారణ పరిస్థితి అన్నారు  శ్రీధర్ రావు దేశ్ పాండే. ఇంజనీర్లు, జిల్లా యంత్రాంగం సన్నద్దంగా  ఉందన్నారు. అంత ప్రమాదకర స్థితిలో కూడా ప్రాజెక్టు ఇంజనీర్లు గేజింగ్ రూం లో ఉండి వరద స్థితిని అంచనా వేస్తూ ఉన్నారని తెలిపారు. అధికారులు అత్యంత సాహసంతో , ధైర్యంతో ఈ పనిలో నిమగ్నం అయ్యారని చెప్పారు.

     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link