Hyderabad Rains Updates: హైదరాబాద్‌లో గాలి, వాన బీభత్సం.. ట్రాఫిక్ జామ్
Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో గాలి, వాన బీభత్సం సృష్టిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. మరో ఐదురోజుల పాటు తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
Telangana Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు మొదలయ్యాయి. తీవ్రమైన ఎండలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వరుణుడు దయ చూపించాడు. మహారాష్ట్రలోని తూర్పు విదర్బ నుంచి తమిళనాడు రాష్ట్రం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. మంగళవారం సాయంత్ర హైదరాబాద్ నగరంలో నల్లని మేఘాలు కమ్మేయగా.. గాలి, వాన బీభత్సం సృష్టించింది. దాదాపు అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. వర్షాలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Hyderabad Rains Updates: సిద్దిపేట జిల్లాలో ఒక్క సారిగా ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం అంతా తడిసిపోయింది. దీంతో రైతుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను రైతులు కోరుతున్నారు.
HYD Rains Livedates: హైదరాబాద్ నగరంలో దాదాపు గంట సేపు వర్షం కురిసింది. దీంతో రహదారులపై భారీగా వర్షపు నీరు చేరింది. డ్రైనేజీలు పొంగి ప్రవహించగా.. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
AP Rains Livedates: నందిగామ, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేటలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.
Hyderabad Rains Livedates: మంచిర్యాల జిల్లా చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి పలు వడ్ల కొనుగోలు సెంటర్లలోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం ఆరడానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుందని.. ధాన్యం కాంట వేయడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
Hyderabad Rains Livedates: రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో పలు చోట్ల కార్లు, బైకులు నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై విద్యుత్ స్థంభాలు కేబుల్ వైర్లు తెగిపడ్డాయి.. ఊహించిన వానతో రాజమండ్రి వాసులు ఉలిక్కిపడ్డారు.
Hyderabad Rains Livedates: ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి, నాగర్కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Hyderabad Rains Livedates: ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Hyderabad Rains Livedates: సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Hyderabad Rains Livedates: జీడిమెట్ల, బహదూర్ పల్లి, పెట్ బషీరాబాద్ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. ఇటు కూకట్ పల్లి, మూసాపేట్, అమీర్ పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కుండపోత వర్షం పడుతోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
Hyderabad Rains Livedates: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. మధ్యాహ్నం వరకూ విపరీతంగా ఎండ కొట్టగా.. సాయంత్ర కాగానే వాతావరణ ఒక్కసారిగా మారింది. ఈదురు గాలులతో సీటీ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని కుత్బుల్లాపూర్, పటాన్ చెరు, BHEL, రాంచంద్రాపురంలో ఉరుమలతో కూడిన వర్షం పడుతోంది. మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Hyderabad Rains Livedates: ఈ నెల 7వ తేదీన జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని IMD హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది.