Secunderabad Muthyalamma Temple Issue: సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తం.. బస్సు అద్దాలు ధ్వంసం
Muthyalamma Temple Issue Live Updates: సికింద్రాబాద్‌లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. హిందూ సంఘాల నాయకుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Muthyalamma Temple Issue Live Updates: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహ ధ్వంసంపై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఇవాళ సికింద్రాబాద్ బంద్‌కు పిలుపునివ్వగా.. ప్రస్తుతం పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. రోడ్లపై వందలాది మంది యువకులు వచ్చారు. ఈ క్రమంలో నిరసన కారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయగా.. హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులు, కుర్చీలతో పోలీసులపై దాడి చేశారు. దీంతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Secunderabad Muthyalamma Temple Issue Live: హిందూ సంఘాల ర్యాలీతో సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వందలాది మంది నిరసనకారులు ఆర్పీ రోడ్డు బాటా చౌరస్తా మధ్యలో కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను ఖాళీ చేయించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు పోలీసులు.
Secunderabad Muthyalamma Temple Issue Live: సికింద్రాబాద్ బంద్‌కు హిందూ సంఘాలు పిలుపునివ్వడంతో హోటళ్లు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు.
Secunderabad Muthyalamma Temple Issue Live: హైదరాబాద్ పోలీసులపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. హిందూ సంఘాల నాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తప్పుబట్టారు.
Secunderabad Muthyalamma Temple Issue Live: సికింద్రాబాద్‌లో ఇంటర్‌నెట్ బంద్ అయింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఇంటర్‌నెట్‌ను నిలిపివేశారు.
Secunderabad Muthyalamma Temple Issue Live: సికింద్రాబాద్ కుమ్మరిగూడ లోని ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో జరిగిన సంఘటనపై ఈరోజు దేవాలయ కమిటీ సభ్యులు కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్ ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను కలిసి జరిగిన సంఘటన గురించి వివరించారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగుడికి కఠినమైన శిక్ష పడేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరోసారి దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి చర్యకు ఎవరైనా పాల్పడాలని చూస్తే భయపడే విధంగా ఉండాలన్నారు. ఈ సంఘటనని రాజకీయ చేయకుండా అందరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే గణేష్, తన సొంత నిధులు 10 లక్షలు, మంత్రి పొన్నం ప్రభుత్వం నిధుల నుంచి 10 లక్షలు దేవాలయ పునర్నిర్మాణానికి అందజేస్తామని చెప్పారు.
Secunderabad Muthyalamma Temple Issue Live: సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఘటనపై దర్యాప్తు సాగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. కేసు నమోదు చేశామని.. వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందరూ సమన్వయం పాటించాలని.. ఆందోళనలకు దిగటం సరికాదని హితవు పలికారు.