Telangana Election 2023 Counting Live Update: మరికొన్ని గంటల్లో కౌంటింగ్.. పూర్తి వివరాలివే
Telangana Assembly Election 2023 Live Update: తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారు..? సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా తీర్పునివ్వడంతో గెలుపు ఎవరినేది ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Telangana Assembly Election 2023 Live News: నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ అయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో తేలడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీ బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈవీఎంలలో ఓటర్లు భద్రపరిచారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు జరగనుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉన్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Latest Updates
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో మొదలుకానుంది.
==> 119 నియోజకవర్గాలు
==> 2,290 మంది అభ్యర్థులు
==> 2,32,59,256 ఓట్లు
==> 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
==> రాష్ట్రవ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు
==> ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురూ
==> ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
==> అనంతరం ఈవీఎం ఓట్ల కౌంటింగ్
Telangana Election 2023 Result Live Updates: గజ్వేల్ నియోజకవర్గం ఫలితం ఆలస్యంగా వెల్లడికానుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. పోటీలో 44 మంది అభ్యర్థులు ఉండడంతో ఫలితం ఆలస్యంగా రానుందన్నారు. రాత్రి 8 గంటల తర్వాతే గజ్వేల్ ఫలితం రావొచ్చన్నారు. 23 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుందన్నారు.
Telangana Election 2023 Result Live Updates: తెలంగాణలో రానున్నది ఇందిరమ్మ రాజ్యమేనని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రాష్ట్రం ప్రతి ఇంటా వెలుగులేనని.. బీఆర్‌ఎస్ నేతల వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. తనను ఆడబిడ్డగా ములుగు ప్రజలు ఆదరించారని.. చిన్న పిల్లలు కూడా తనకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. తన జీవితానికి ఇంకేం కావాలని.. తన విజయానికి కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Telangana Election 2023 Result Live Updates: ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ వద్ద శ్రీ చైతన్య కళాశాలలో కౌటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పరిశీలించారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ..
==> ప్రస్తుతం 14 టేబుల్స్ ఉన్నాయి. ఇంకా రెండు అవసరం ఉన్నాయి
==> ఈసీకి ఇంకా రెండు టేబుల్స్ కావాలని అర్జీ పెట్టాం
==> ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా 25 రౌండ్స్ ఉంటాయి
==> అర్ధగంటకు ఒక టేబుల్ కౌంటింగ్ అయిపోతుంది
==> ఖమ్మం నియోజకవర్గానికి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు
==> పాలేరు కూడా ఎక్కువగానే అభ్యర్థులు ఉన్నారు
==> ఖమ్మం నియోజకవర్గ రిజల్ట్ రాత్రి 8 గంటల వరకు టైమ్ పడుతుంది
==> పాలేరు నియోజకవర్గం రిజల్ట్ సాయంత్రం 6 వరకు వస్తుంది
==> తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించాకే ఈవీఏం లెక్కిస్తాం..
==> ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ 14,373
==> రేపు ఉదయం 6 గంటల వరకు సర్వీస్ బ్యాలెట్స్‌ను తీసుకుంటాం..
==> అత్యధికంగా ఖమ్మంలో 5,567 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి
==> లెక్కింపు సిబ్బంది 340 మంది
==> ఫలితాల కోసం కళాశాల గ్రౌండ్‌లో స్క్రీన్లు ఏర్పాటు చేశాం..
==> కౌంటింగ్ కేంద్రం బయట మూడు అంచల భద్రత కొనసాగుతుంది
==> 24 గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాలు గుర్తించాం
==> ఎవరికి సెల్‌ఫోన్ అనుమతి లేదు
==> ఎల్లుండి ఉదయం వరకు ఎక్కడ ర్యాలీలకు అనుమతి లేదు.
Telangana Election 2023 Result Live Updates: కాంగ్రెస్ ముఖ్య నాయకులతో రాహుల్ గాంధీ జూమ్‌లో మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాలు దాటి రావద్దని అభ్యర్థులకు ఆదేశించారు. ఏఐసీసీ పరిశీలకులు కూడా ఎవరికి కేటాయించిన కౌంటింగ్ కేంద్రాల వద్దనే ఉండాలన్నారు. కాగా.. ఇప్పుడే హైదరాబాద్‌కు రావాలని అభ్యర్థులను పీసీసీ నాయకులు.. మళ్లీ వద్దని చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ రోజు రాత్రి 11:30 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రికి బస చేసి.. ఇక్కడి నుంచే కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించనున్నారు. మరికొందరు ఏఐసీసీ నాయకులు కూడా రాష్ట్రానికి రానున్నారు.
Telangana Election 2023 Result Live Updates: రేపటితో తన మొక్కు తీరుతుందని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. తాను గడ్డం తీసేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి ఎవనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ మంచి మెజారిటీతో అధికారంలోకి రానుందన్నారు. క్యాంప్ గురించి తెలియదని.. ఇప్పుడు పరిస్థితుల్లో ఏర్పాటు చేసినా తప్పులేదన్నారు.
Telangana Election 2023 Result Live Updates: విపక్షాలు దుష్ప్రచారం చేసినా.. ప్రజా తీర్పు తమ వైపే ఉందని వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. పోలింగ్ జరుగుతుండగానే అంచనాలు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. సర్వేలు అవాస్తవమని.. అధికారంలోకి తామే రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని స్పష్టం చేశారు.
Telangana Election 2023 Result Live Updates: కాంగ్రెస్ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకుడు మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రలోభపెడతారని తెలిసిందని ఆరోపించారు. ముందు జాగ్రత్తగానే తమర్టీ అభ్యర్థులకు సూచనలు చేశామని చెప్పారు.
Telangana Election 2023 Result Live Updates: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంత రావు ధీమా వ్యక్తం చేశారు. శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యత పేదలకే ఇస్తామన్నారు. తెలంగాణలో 70కి పైగా సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. డబ్బుల రాజకీయం పోయి.. పేదలు రాజకీయాల్లో ఎదగాలని అన్నారు.
Telangana Election 2023 Result Live Updates: బీఆర్ఎస్ 70 నుంచి 75 సీట్లు గెలవబోతుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్‌కు ఎగ్జాక్ట్ పోల్స్‌కు చాలా తేడా ఉంటుందని చెప్పారు. ఆదివారం ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు రాబోతున్నాయని.. అభివృద్ధి చేసిన వారి వైపే ప్రజలు మొగ్గు చూపుతారని అన్నారు. బీఆర్ఎస్ లేకపోతే ఉన్న పథకాలు అన్ని పోతాయన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
Telangana Election 2023 Result Live Updates: జీహెచ్‌ఎంసీ పరిధిలో చార్మినార్ ఫలితం ముందుగా రానుంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ 15 రౌండ్లలోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు. 622 పోలింగ్ కేంద్రాలున్న శేరిలింగంపల్లికి లెక్కింపునకు 23 రౌండ్లు పడుతుందని చెప్పారు.
Telangana Election 2023 Result Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్టిట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా లేకపోవడంతో ఓటు బ్యాంక్ అయినా పెరుగుతుందని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు రాగా.. లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతం ఓట్లు సంపాదించింది. ప్రస్తుతం ఎక్కువ సీట్లు రాకపోయినా.. ఓటు బ్యాంక్ పెరిగితే వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. బీసీ సీఎం ప్రకటన, ఎస్సీ వర్గీకరణ హామీలు ఓటు బ్యాంకును పెంచుతాయని నమ్మకంతో ఉంది.
Telangana Election 2023 Result Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులకు అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ అభ్యర్థులందరూ వెంటనే హైదరాబాద్‌కు రావాలని ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటులో ఎటువంటి తప్పిదాలు జరగకుండా కాంగ్రెస్ ముందు జాగ్రత్త అధిష్టానం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Telangana Election 2023 Result Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్‌పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కోసం స్పెషల్‌గా సూట్ కేస్‌ను పంపించారు. కేసీఆర్‌ను ఓడించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు BYE BYE చెప్పారని అన్నారు.
Telangana Election 2023 Result Live Updates: ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ నేతల భేటీ జరిగింది. ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఫలితాల అనంతరం అమలు చేసే వ్యూహంపై కూడా చర్చించారు.
Telangana Election 2023 Result Live Updates: సీఈవో వికాస్ రాజ్‌ను కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. రైతుబంధు కింద రూ.6 వేల కోట్ల నిధులను కాంట్రాక్టర్లకు మళ్లిస్తున్నారని.. వాటిని ఆపాలని కోరామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు కుట్ర జరుగుతోందని, దానిపై ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరినట్లు చెప్పారు.
Telangana Election 2023 Result Live Voter Counting: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపునకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ నెల నుంచి డీఏ చెల్లింపులకు అభ్యంతరం లేదని తెలిపింది.
ఆదివారం చేపట్టున్న ఓట్ల లెక్కింపు కోసం ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు చేపడుతోంది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు సంబందించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ,నిర్మల్ , ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించటానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిఘా నీడలో కౌంటింగ్ నిర్వహించేలా సీసీ కెమెరాలు అమర్చారు.
Telangana Election 2023 Result Live Voter Counting: రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 అమలు చేయనున్నారు. మద్యం అమ్మకాలు కూడా బంద్ కానున్నాయి. రేపు ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Telangana Election 2023 Result Live Voter Counting: కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ కరీంనగర్, హుజురాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఉండనుంది. సిరిసిల్లలోని బద్దనపల్లిలోని గురుకుల పాఠశాల కౌంటింగ్ కేంద్రంలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల కౌంటింగ్ ఉండనుంది.
==> జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి (జగిత్యాలలోని వీఆర్‌కే ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్)
==> పెద్దపల్లి, మంథని, రామగుండం (మంథని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్)