Lal Darwaza Bonalu Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...
Lal Darwaza and Amberpet Bonalu Updates: నేడు హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో వైభోవేపతంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
Lal Darwaza and Amberpet Bonalu Updates: నేడు హైదరాబాద్ పాతబస్తీలో లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో వైభోవేపతంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లాల్ దర్వాజ బోనాలతో పాటు అంబర్‌పేట్‌లోనూ ఇవాళ అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ ప్రజలు బోనాల పండగ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోనాల పండగ వేడుకలపై లైవ్ అప్‌డేట్స్ మీకోసం...
Latest Updates
బోనాల పండగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జీహెచ్ఎంసీ భారతీనగర్ టీఆర్ఎస్ కార్పోరేటర్ సింధు రెడ్డి
బోనాల పండగ సందర్భంగా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మల్లారెడ్డి...
ఆలయంలోకి వెళ్లకుండానే వెనుదిరిగిన షర్మిల
లాల్ దర్వాజ్ సింహ వాహిని మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించిన వైఎస్ షర్మిల.
అలయం లోపలికి వెళ్ళకుండానే బోనం వేరే మహిళ నెత్తిన పెట్టి.. స్టేజ్‌పై మాట్లాడి వెళ్లిపోయిన షర్మిల..
అంబర్‌పేట మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన బీజేపీ నేత మురళీధర్ రావు
సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకున్న మురళీధర్ రావు
కట్టమైసమ్మ బోనాలు
హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న కట్టమైసమ్మ తల్లి ఆలయంలో ఇవాళ బోనాల పండగ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని తల్లిదండ్రుల కలిసి దర్శించుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు...
సికింద్రాబాద్ రాంనగర్‌లోని పోచమ్మ దేవాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అమ్మవారికి పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.
అంబర్‌పేట్ మహంకాళి అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పూజలు
హైదరాబాద్ లాల్ దర్వాజ బోనాల పండగలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఆషాఢ మాసం బోనాల సందర్భంగా సనత్ నగర్‌లోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అంబర్‌పేట్ ట్రాఫిక్ ఆంక్షలు :
ఉప్పల్-అంబర్‌పేట్ మార్గంలో రాకపోకలు పక్కనున్న కాలనీల మీదుగా మళ్లిస్తారు.
ఉప్పల్ వైపు నుంచి వచ్చే వాహనాలను మలికార్జున నగర్, డీడీ కాలనీ మీదుగా శివం సర్కిల్ వైపు మళ్లిస్తారు.
మూసారంబాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలను అలీ కేఫ్ మీదుగా చే నంబర్ వైపు మళ్లిస్తారు.
ఉప్పల్ నుంచి సీబీఎస్ వైపు వెళ్లే బస్సులు తార్నాక, విద్యానగర్, నల్లకుంట, నింబోలి అడ్డా, చాదర్ ఘాట్ మీదుగా మళ్లిస్తారు.
కోఠి నుంచి ఉప్పల్ వాహనాలు అంబర్ పేట మీదుగా కాకుండా తార్నాక, హబ్సిగూడ మీదుగా ఉప్పల్ సర్కిల్‌కి చేరుకుంటాయి.
పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే :
చార్మినార్ ప్రధాన రహదారి అస్రా హాస్పిటల్ నుంచి వచ్చే వాహనాలు మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ మీదుగా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు.
ఉప్పుగూడ-ఛత్రినాక మార్గంలో వెళ్లే వాహనాలను గౌలిపురా క్రాస్ రోడ్స్ నుంచి మొఘల్‌పురా పీఎస్ వైపు మళ్లిస్తారు.
కందికల్ గేట్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్ ఛత్రినాక పీఎస్‌వై జంక్షన్ మీదుగా గౌలిపురా రూట్‌కి మళ్లిస్తారు
ఫలక్‌నుమా నుంచి వచ్చే వాహనాలను అలియాబాద్ మీదుగా షంషీర్‌గంజ్, గోశాల, తాడ్ బండ్ వైపు మళ్లిస్తారు.
రాజన్నబౌలి నుంచి వచ్చే వాహనాలను పత్తర్‌కి దర్గా లైన్, రామస్వామి గంజ్ మీదుగా మళ్లిస్తారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు లాల్ దర్వాజ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. నెత్తిన బోనంతో కుటుంబ సభ్యులతో కలిసి సింధు ఆలయానికి వచ్చారు. ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.