BADRACHALAM FLOODS LIVE: భద్రాచలంలో గవర్నర్, సీఎం ఎవరికి వారే.. వర్షం తగ్గడంతో కేసీఆర్ ఏరియల్ సర్వే
Godavari Floods Live: వారం రోజులు కుండపోతగా కురిసిన వర్షాలతో తెలంగాణలో అపార నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం స్పష్టించాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు తగ్గి మూడు రోజులైనా వరద మాత్రం తగ్గలేదు. ఇంకా పలు గ్రామాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి.
Godavari Floods Live: వారం రోజులు కుండపోతగా కురిసిన వర్షాలతో తెలంగాణలో అపార నష్టం జరిగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో వరదలు బీభత్సం స్పష్టించాయి. వందలాది గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు తగ్గి మూడు రోజులైనా వరద మాత్రం తగ్గలేదు. ఇంకా పలు గ్రామాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి. వేలాది ఎకరాలు నీట మునిగాయి. వరదలతో తమకు తీరని నష్టం జరిగిందనే రైతులు కలవరపడుతున్నారు. గవర్నర్ తమిళిసై , సీఎం కేసీఆర్ వేరువేరుగా వరద ప్రాంతాల్లో పర్యటించారు. గవర్నర్ భద్రాచలంలో నేరుగా వరద బాధితులను కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటనలకు సంబంధించి అప్ డేట్స్ మినిట్ టు మినిట్...
Latest Updates
భద్రాచలంలో తగ్గిన వర్షం
వరద ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
వరద బాధితులకు సాయం ప్రకటించిన కేసీఆర్
వరద బాధిత ప్రతి కుటుంబానికి రూ. 10 వేల సాయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటించారు. అశ్వాపురం మండలం బట్టీలగుంపు వద్ద వరద బాధితులను కలిశారు. స్థానిక సర్పంచ్‌లు తమ సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. తర్వాత అశ్వాపురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లారు గవర్నర్ తమిళిసై. ముంపు బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చింది- కేసీఆర్
గతంలో ఉత్తరాఖండ్ లో అలాగే చేశారు- కేసీఆర్
ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారు- కేసీఆర్
కడెం ప్రాజెక్ట్ దేవుడి దయ వల్లే బయటపడింది- కేసీఆర్
గోదావరి వరదకు శాశ్వత పరిష్కారం కావాలి- కేసీఆర్
భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు- కేసీఆర్
శాశ్వత కాలనీల కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలి- కేసీఆర్
వరదలతో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం- కేసీఆర్
క్లౌడ్ బరస్ట్ జరిగడానికి కుట్ర జరిగిందని ప్రచారం- కేసీఆర్
భద్రాచలంల గోదావరి కరకట్టను పరిశీలించిన సీఎం కేసీఆర్
వరద బాధితులతో స్వయంగా మాట్లాడిన కేసీఆర్
స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన కేసీఆర్
భద్రాచలం గోదావరి బ్రిడ్జీ మీదకు చేరుకున్న సీఎం కేసిఆర్
ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి తల్లికి శాంతి పూజ నిర్వహించిన సీఎం కేసీఆర్
గోదావరి ప్రవాహం, పరిసర ప్రాంతాలను పరిశీలించిన కేసీఆర్
భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో వరద బాధితుల ఆందోళన
సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు యత్నం
వరద బాధితులను అడ్డుకున్న పోలీసులు
కేసీఆర్ పర్యటనతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల హౌజ్ అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామంలో వరద బాధితులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై. SKT పంక్షన్ హాల్ ఉన్న పునరావాస కేంద్రంనికి చేరుకొని,లయన్స్ క్లబ్ ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరద బాధితులకు,చిన్నారులకు, బిస్కెట్లు, హెల్త్ కిట్టు లను పంపిణీ చేసిన తమిళి సై. అయితే వరద బాధితుల నుంచి తమిళ సైకి నిరసన సెగ తగిలింది. వరద బాధితులతో నిరసన వ్యక్తం కావడడం, మహిళలు అరుపులు కేకలు పెట్టడంతో హెవీ వాటర్ ప్లాంట్ గెస్ట్ హౌస్ కు వెనుదిరిగి వెళ్లిపోయారు గవర్నర్ తమిళ సై.
ఏటూరు నాగారంలో రాత్రి నుంచి భారీ వర్షం
హెలికాప్టర్ కు జర్నీకి అనుమతి ఇవ్వని అధికారులు
రోడ్డు మార్గంలో ఏటూరునాగారానికి సీఎం కేసీఆర్
ఏటూరునాగారం నుంచి భద్రాచలం వెళ్లనున్న కేసీఆర్
వరదలపై అధికారులతో సమీక్షించనున్న కేసీఆర్
తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మళ్లీ అవమానం
గవర్నర్ పర్యటనను పట్టించుకోని కొత్తగూడెం జిల్లా అధికారులు
గవర్నర్ స్వాగత కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ డుమ్మా
హైదరాబాద్ నుంచి రైలు మార్గం ద్వారా మణుగూరు చేరుకున్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్
గవర్నర్ తమిళిసై స్వాగతం పలికిన ఆశ్వాపురం తహశీల్దార్ సురేష్, అడిషనల్ ఎస్పీ కేఅర్కే ప్రసాద్
అశ్వాపురంలోని హెవీవాటర్ ప్లాంట్ విశ్రాంతి భవనంలో గవర్నర్ బస
సుదీర్ఘ కాలం తర్వాత భద్రాచలానికి సీఎం కేసీఆర్
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన
2015,16 తరువాత మూడోసారి భద్రాచలంకు సీఎం కేసీఆర్
వర్షం కారణంగా రద్దైన ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
రోడ్డు మార్గం గుండా వరంగల్ నుండి భద్రాచలంకు చేరుకోనున్న సీఎం
గోదావరి వరదల ఎఫెక్ట్, సహాయక చర్యలపై సమీక్షించనున్న కేసీఆర్