Basara IIIT Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళి సై.. పోలీసుల ఆంక్షలపై సీరియస్
Governer Tamilsai: నెల రోజులకు పైగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు గవర్నర్ తమిళి సై సౌందరాజన్. విదార్థులతో మాట్లాడుతున్నారు
Governer Tamilsai: నెల రోజులకు పైగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు గవర్నర్ తమిళి సై సౌందరాజన్. విదార్థులతో మాట్లాడుతున్నారు. వాళ్ల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను గవర్నర్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. క్యాంపస్ కు వచ్చిన గవర్నర్ కు ట్రిపుల్ ఐటీ ఇంచార్జ్ వీసీ వెంకరమణ, ఇతర అధికారులు స్వాగతం చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ పర్యటనపై లైవ్ అప్ డేట్స్..
Latest Updates
బాసర ట్రిపుల్ ఐటీ మెస్ ను పరిశీలించిన గవర్నర్
విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను పరిశీలించిన తమిళి సై
విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానని గవర్నర్ హామీ
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో గవర్నర్ తమిళి సై ముఖాముఖి.. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న గవర్నర్
బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న గవర్నర్ పర్యటన
విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన తమిళి సై
తర్వాత విద్యార్థులతో గవర్నర్ తమిళి సై ముఖాముఖి
విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న గవర్నర్ తమిళి సై
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మాట్లాడిన గవర్నర్ తమిళి సై
తమ సమస్యలను గవర్నర్ కు వివరించిన విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యల్లో ఉన్నారు- తమిళి సై
విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా-తమిళి సై
గవర్నర్ తమిళి సైకి బాసర ట్రిపుల్ ఐటి SGC బహిరంగ లేఖ
రాజ్యాంగం ప్రకారం గవర్నర్ విచక్షణ అధికారాలు ఉపయోగించాలని కోరిన SGC
తాము చేసిన విజ్ఞప్తులను మంత్రి మండలి, ఉభయ చట్ట సభల దృష్టికి తీసుకెళ్లాలని వినతి
రెగ్యులర్ విసి నియామకం చేపట్టాలని కోరిన SGC
డీన్స్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేటెడ్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలో జాప్యంపై ప్రశ్నలు
ఆర్టికల్ 175 ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఉభయ సభల్లో ట్రిపుల్ ఐటి సమస్యలను ప్రస్తావించవచ్చన్న విద్యార్థులు
ట్రిపుల్ ఐటికి క్రమంగా బడ్జెట్ తగ్గడం, ఫ్యాకల్టీ విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా లేకపోవడం..
ఆహార నాణ్యత, ICT సంస్థ లాంటి నాణ్యమైన ఆహార వస్తువులు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు వ్యవహారం
పీయూసీ హాస్టల్స్ పునరుద్ధరణకు డిమాండ్
తక్షణ ఖర్చులు అవసరాలను తీర్చడానికి నిధులు కేటాయించేలా మంత్రి మండలికి సిఫార్సు
అత్యంత తక్షణ అవసరాల కోసం గవర్నర్‌కు అందుబాటులో ఉన్న విచక్షణా నిధి నుండి..
కొంత నిధులను విడుదల చేయాలని కోరిన SGC
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటికి చేరుకున్న గవర్నర్ తమిలిసై
స్వాగతం పలికిన ట్రిపుల్ ఐటి ఇంచార్జ్ విసి వెంకటరమణ, డైరెక్టర్, అడిషనల్ కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు
డుమ్మా కొట్టిన జిల్లా కలెక్టర్ ముష్రాఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్
గవర్నర్ తమిళి సై పర్యటనతో బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు నేరుగా గవర్నర్ ను కలవకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో అధికారులు, పోలీసుల తీరుపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించడంపైనా గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా విధుల్లో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశించారు.