Hyderabad Police Towers Inauguration: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
Telangana Police Integrated Command and Control Centre: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మించిన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం ప్రారంభించారు.
Telangana Police Integrated Command and Control Centre: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మించిన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతికతో కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి దాదాపుగా ఆరేళ్లు పట్టింది. ఈ సెంటర్ ద్వారా తెలంగాణవ్యాప్తంగా ఉన్న 10 లక్షల సీసీటీవీ కెమెరాలను పోలీస్ శాఖ మానిటర్ చేస్తుంది. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తిన త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు ఇక్కడి నుంచే అన్ని విభాగాలను సమన్వయం చేస్తుంది. తద్వారా శాంతి భద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టమవుతుంది. టీపీఐసీసీసీ ప్రారంభోత్సవంపై లైవ్ అప్‌డేట్స్ మీకోసం...
Latest Updates
టీఎస్‌పీఐసీసీ..
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వివిధ విభాగాలను సందర్శిస్తున్న సీఎం..
టవర్ Dలో మ్యూజియం ను సందర్శించిన సీఎం కేసీఆర్.
తెలంగాణ పోలీస్ చరిత్రను, ప్రాశస్త్యాన్ని తెలిపేలా మ్యూజియం..
మొదటి కొత్వాల్ రాజ బహుదూర్ కాలం నుండి పోలీస్ వ్యవస్థ ఎలా ఫంక్షన్ అవుతుంది తెలిపేలా మ్యూజియం
మ్యూజియంలో అలనాటి పోలీస్ వ్యవస్థను తెలిపే ఫోటో గ్రాఫ్స్...
గతంలో నేరస్తులను పట్టుకోవడానికి, వారి కదలికలను గుర్తించడానికి వినియోగించిన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ సాధనాలను అందుబాటులో ఉంచిన పోలీసులు.
మ్యూజియం గురించి సీఎం కేసీఆర్ కు వివరించిన సీపీ ఆనంద్..
టీఎస్ఐపీసీసీసీ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వ మత ప్రార్థనలు...
పైలాన్ ఆవిష్కరణ తర్వాత టీఎస్‌పీఐసీసీసీ భవనంలోకి అడుగుపెట్టిన సీఎం కేసీఆర్...
కేసీఆర్ వెంట పలువురు మంత్రులు,చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్,
తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు..
తెలంగాణ రాష్ట్రాన్ని తన విజన్‌తో వరల్డ్ క్లాస్ స్టేట్‌గా తీర్చిదిద్దాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు ఉదాహరణే పోలీస్ కమాండ్ సెంటర్ - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డేటా సెంటర్ యూనిట్స్..
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీఎస్‌పీఐసీసీసీ ప్రారంభోత్సవం...
టీఎస్‌పీఐసీసీసీ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ముఖ్యమంత్రి వెంట మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్
టీఎస్‌పీఐసీసీసీ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ మధ్యాహ్నం 12 గం. నుంచి సాయంత్రం 4.30 గం. వరకు బంజారాహిల్స్ రోడ్ నం.12 మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
సీసీఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, అన్ని విభాగాలు ఇక్కడి నుంచే పనిచేయనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సీఎం, హోమ్ మినిస్టర్ ఇక్కడి నుంచే పరిస్థితులను పర్యవేక్షించేలా వారికి ప్రత్యేక ఛాంబర్స్ ఉన్నాయి. డయల్ 100, షీ టీమ్స్, హ్యాక్ ఐ, అంబులెన్స్ తదితర వ్యవస్థలన్నీ ఇక్కడి నుంచే పనిచేస్తాయి.
టీఎస్‌పీఐసీసీసీ ప్రారంభోత్సవంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. సీఎం కేసీఆర్ విజన్‌పై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్
టీఎస్‌పీఐసీసీసీ ప్రారంభోత్స వేళ కమిషనర్ సీవీ ఆనంద్ ట్వీట్
కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం.
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సరిగ్గా ఒంటి గంట పదహారు నిముషాలకు ప్రారంభోత్సవం.
కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు, సీఎం ఛాంబర్, సీపీ చాంబర్లు కూడా ప్రారంభం .
హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు..
సీఎం కేసీఆర్ కు పూర్ణ కుంభం తో స్వాగతం పలకనున్న వేద పండితులు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీసీసీ ప్రారంభోత్సవం
ఇప్పటికే తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసిన సీపీ సీవి ఆనంద్ దంపతులు..
ప్రారంభోత్సవం సందర్భంగా సీసీసీ భవనాన్ని సర్వాంగ సుందరంగా అలకంరించిన పోలీసులు.
మరోవైపు సీసీసీ వద్ద భారీ బందోబస్తు... సిటీ పోలీసులు అందరూ సీసీసీ వద్దే.
సీసీసీ ప్రారంభం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
11 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు :
ఈ భవనాన్ని ఏడెకెరాల్లో 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
ఈ భవనంలో మొత్తం 5 టవర్స్ ఉన్నాయి.
టవర్ ఏలో 15 అంతస్తులు, టవర్ బీలో 20 అంతస్తులు ఉన్నాయి.
మీడియా ట్రైనింగ్ సెంటర్, 480 సీట్ల కెపాసిటీతో కూడిన త్రీ లెవల్ థియేటర్ టవర్ సీ, డీల్లో ఉన్నాయి.
టవర్ ఈలోని మొదటి మూడు అంతస్తుల్లో కమాండ్, కంట్రోల్ విభాగాలు, డేటా సెంటర్ ఉంటాయి.
600 ఫోర్ వీలర్స్, 350 టూ వీలర్స్‌ను పార్క్ చేసే సౌకర్యం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ప్రదేశం 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలో ఉంటుంది.