BJP Vijaya Sankalpa Sabha Live Updates: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం.. సమావేశ హాల్లోకి తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు
BJP Vijaya Sankalpa Sabha Live Updates: హైదరాబాద్‌లో ఇవాళ బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
BJP Vijaya Sankalpa Sabha Live Updates: హైదరాబాద్‌లో రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాళ జరగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమావేశాలు జరుగుతాయి. సమావేశాల్లో భాగ్యనగర డిక్లరేషన్ పేరిట కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదిస్తారు. ఈ సమావేశాల అనంతరం బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కన్నా ప్రధాని ప్రసంగించబోయే సభ పైనే అందరి దృష్టి నెలకొంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచిన వేళ.. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా మోదీ ఏం మాట్లాడబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు, ఆరోపణలకు ఆయన ఏ స్థాయిలో కౌంటర్ ఇవ్వబోతున్నారు.. తెలంగాణ సమాజానికి ఏ సందేశమివ్వబోతున్నారనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు, విజయ సంకల్ప సభకు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
Latest Updates
హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో అందరికీ అభివాదం చేస్తూ ప్రసంగం ప్రారంభించారు. ఏ ఒక్క రాజకీయ విమర్శ లేకుండా..కేసీఆర్ ప్రస్తావన లేకుండా మొత్తం ప్రసంగం కొనసాగించారు.
సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ మంత్రంతో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరుగుతుందన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశామని..సులభంగా రుణాలు అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ వ్యాక్సిన్ రీసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని కాపాడిందని గుర్తు చేశారు. తెలుగులో మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తీసుకొస్తున్నామని చెప్పారు. గత 8 ఏళ్లుగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామన్నారు ప్రధాని మోదీ.
హైదరాబాద్‌లో రెండ్రోజుల్నించి జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంతో సమావేశం ముగిసింది. తెలంగాణ అంశంపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. ఓ వైపు జోరున వర్షం కురుస్తున్నా సమావేశం కొనసాగింది.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో కీలక విషయాల్ని ప్రస్తావించారు. బీజేపీ పార్టీ కేవలం హిందూవులకే కాకుండా అన్ని మతాలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని కార్యకర్తలకు సూచించారు. పటేల్ వల్లనే ఈరోజు దేశంలో తెలంగాణ ప్రాంతముందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పార్టీని చేరువ చేసినందుకు జాతీయ ప్రతినిధుల్ని మోదీ ఈ సందర్భంగా అభినందించారు.
హైదరాబాద్‌లో రెండ్రోజుల్నించి జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంతో సమావేశం ముగిసింది. తెలంగాణ అంశంపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. ఓ వైపు జోరున వర్షం కురుస్తున్నా సమావేశం కొనసాగింది.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో కీలక విషయాల్ని ప్రస్తావించారు. బీజేపీ పార్టీ కేవలం హిందూవులకే కాకుండా అన్ని మతాలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని కార్యకర్తలకు సూచించారు. పటేల్ వల్లనే ఈరోజు దేశంలో తెలంగాణ ప్రాంతముందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పార్టీని చేరువ చేసినందుకు జాతీయ ప్రతినిధుల్ని మోదీ ఈ సందర్భంగా అభినందించారు.
హైదరాబాద్‌లో రెండ్రోజుల్నించి జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగంతో సమావేశం ముగిసింది. తెలంగాణ అంశంపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. ఓ వైపు జోరున వర్షం కురుస్తున్నా సమావేశం కొనసాగింది.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో కీలక విషయాల్ని ప్రస్తావించారు. బీజేపీ పార్టీ కేవలం హిందూవులకే కాకుండా అన్ని మతాలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని కార్యకర్తలకు సూచించారు. పటేల్ వల్లనే ఈరోజు దేశంలో తెలంగాణ ప్రాంతముందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పార్టీని చేరువ చేసినందుకు జాతీయ ప్రతినిధుల్ని మోదీ ఈ సందర్భంగా అభినందించారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణపై బీజేపీ ప్రకటన చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షల్ని కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీజేపీ తెలిపింది. ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని పిలుపునిచ్చింది. డ్రైవింగ్ సీట్లో కేసీఆర్ ఉన్నా..స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరమంతా బీజేపీకు పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు.
భారీ వర్షం
మరోవైపు బీజేపీ సమావేశం జరుగుతున్న పెరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో భారీ వర్షం పడుతోంది. దాంతో సభకు వచ్చే బీజేపీ శ్రేణులకు ఇబ్బంది ఎదురవుతోంది. అందరూ వాటర్ ప్రూఫ్ టెంట్లలోకి వెళ్లి తలదాచుకుంటున్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా..కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దిగజార్చాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద, అవినీతి రాజకీయాలకు వేదికగా మారిందని..అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మోదీకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోవిడ్, సర్జికల్ స్ట్రైక్స్, రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించినా..ప్రతికూల రాజకీయాలే చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేయడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక జెండా అన్నారు.
ప్రధాని ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్బంగా సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికేందుకు వెళ్లకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. పాతబస్తీ పురానాపూల్ ఎక్స్‌రోడ్‌లో స్థానిక బీజేపీ నేత ఉమా మహేందర్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం జరిగింది. ఒక్కొక్కరుగా విజయ సంకల్ప సభకు తరలివస్తున్న బీజేపీ కార్యకర్తలు...
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కలకలం
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కలకలం
సమావేశ హాల్లోకి తెలంగాణ ఇంటలిజెన్స్ ఎస్బీ అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకత్వం
బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి పోలీస్ సిబ్బందిని గుర్తించి పట్టుకోవడంతో బయటకు పొక్కిన విషయం
మోదీకి నా చేతి వంట వడ్డించే అవకాశం రావడం నా అదృష్టం- కరీంనగర్ యాదమ్మ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ దిగ్గజ నేతలకు తెలంగాణ వంటకాలను నా చేతితో వండి వడ్డించే అవకాశం రావడం నా అదృష్టం. నా జన్మ ధన్యమైంది.
*ఈ అవకాశం కల్పించిన బండి సంజయ్ గారికి శతకోటి దండాలు.. ఆయనకు రుణపడి ఉంటా.
నన్ను ఇక్కడికి రానివ్వలేదని కొందరు తప్పుడు ప్రచారం చేశారు. నన్ను ఎవ్వరూ అడ్డుకోలేదు. ఇక్కడికి నన్ను సాదరంగా ఆహ్వానించారు
- యాదమ్మ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.
3 మెట్రో స్టేషన్ల మూసివేత
భద్రతా కారణాల రీత్యా జేబీఎస్ మెట్రో స్టేషన్‌తో పాటు పరేడ్ గ్రౌండ్స్, ప్యారడైజ్ మెట్రో స్టేషన్స్ మూసివేత..
ఇవాళ సాయంత్రం 5.30 గం. నుంచి రాత్రి 8గం. వరకు ఈ మూడు మెట్రో స్టేషన్లు మూసివేత
జేబీఎస్ మెట్రో స్టేషన్ మూసివేత
విజయ సంకల్ప సభ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా జేబీఎస్ మెట్రో స్టేషన్ మూసివేత
సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మెట్రో స్టేషన్ బంద్.
మిగిలిన స్టేషన్లలో సర్వీసులు యధాతధంగా నడుస్తాయంటూ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
విజయ సంకల్ప సభ ఏర్పాట్లు పూర్తి
దాదాపు 5 లక్షల మంది వస్తారని బీజేపీ అంచనా..
పరేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో 4 వేదికలు ఏర్పాటు..
వీవీఐపీ వేదికలో లో మోదీ ,అమిత్‌షా, జేపీ నడ్డా, బండి సంజయ్ ,లక్ష్మణ్..
వీఐపీ వేదిక పై 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ,కేంద్ర మంత్రులు..
మరో వేదికపై ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ముఖ్య ప్రతినిధులు..
నాలుగవ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు..
పరేడ్ గ్రౌండ్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో భారీ బందోబస్తు..
నగరం మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు...
హైదరాబాద్, మేడ్చల్ , రంగారెడ్డి పరిధిలనే 950 ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకున్న బీజేపీ..
జిల్లాల నుండి జన సమీకరణ కు 15 ప్రత్యేక రైళ్లు.
సికింద్రాబాద్ బిజెపి బహిరంగ సభకు వచ్చే వారికోసం..
జింఖానా గ్రౌండ్స్ లో విఐపి .. పరేడ్ గ్రౌండ్స్ సభాస్థలి సమీపంలో వివిఐపి పార్కింగ్...
విజయ సంకల్ప సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ
పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ పాల్గొనే సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ
కనీస ఏర్పాట్లు చేయని బల్దియా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు
బీజేపీ నేతల వినతులు పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులు
పారిశుద్ధ్య నిర్వహణ, శానిటైజేషన్, ఇతరత్రా బాధ్యతలన్నీ కంటోన్మెంట్ బోర్డు పర్యవేక్షణలోనేవిజయ సంకల్ప సభ వేళ ట్రాఫిక్ ఆంక్షలు :
HICC మాదాపూర్ - జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ - రాజ్ భవన్ - పంజాగుట్ట - బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ - పరేడ్ గ్రౌండ్ మరియు పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలుట్రాఫిక్ రద్ధీ ఉండే ప్రాంతాలు
1) చిలకలగూడ X రోడ్, (2) అలుగడ్డబాయి X రోడ్, (3) సంగీత్ X రోడ్, (4) YMCA X రోడ్, (5) ప్యాట్నీ X రోడ్, (6) SBH X రోడ్, (7) ప్లాజా, (8) CTO జంక్షన్, (9) బ్రూక్‌బాండ్ జంక్షన్, (10) టివోలి జంక్షన్, (11) స్వీకార్‌ఉప్‌కార్ జంక్షన్, (12) సికింద్రాబాద్ క్లబ్, (13) తిరుమలగిరి x రోడ్, (14) తాడ్‌బండ్ x రోడ్ (15) సెంటర్ పాయింట్, (16) డైమండ్ పాయింట్ (17) బోయినపల్లి X రోడ్, (18) రసూల్‌పురా, బేగంపేట్ (19) ప్యారడైజ్.
బీజేపీ విజయ సంకల్ప సభ
బహిరంగ సభకు వచ్చే వారికోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు..
జింఖానా గ్రౌండ్స్‌లో వీఐపీ పార్కింగ్
పరేడ్ గ్రౌండ్స్ సభాస్థలి సమీపంలో వీవీఐపీ పార్కింగ్
శామీర్‌పేట్, కరీంనగర్, సిద్దిపేట్ నుంచి వచ్చేవారికి దోబిఘాట్‌లో పార్కింగ్
నిజామాబాద్, అదిలాబాద్, మెదక్, సుచిత్ర , బాలనగర్ మీదుగా వచ్చేవారికి పోలోగ్రౌండ్స్
వరంగల్ ,నల్గొండ, ఉప్పల్ నుండి వచ్చేవారికి రైల్ నిలయంలో పార్కింగ్
మహాబూబ్ నగర్, రంగారెడ్డి , టాంక్ బండ్ వైపు నుండి వచ్చేవారికి నెక్లెస్ రోడ్డులో పార్కింగ్
పరేడ్ గ్రౌండ్ బీజేపీ బహిరంగ సభకు 5 వేల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట భద్రత
భద్రతా వలయంలో ప్రధాని మోదీ పర్యటించే ప్రాంతాలు
మోదీ భద్రతను క్షణ, క్షణం పర్యవేక్షిస్తున్న ఎస్పీజీ
మోదీ పర్యటన ప్రాంతాల్లో నాలుగంచెల భద్రత
ప్రధాని చుట్టూ ఎస్పీజీ తో పాటు పటిష్టమైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీమ్స్ నిరంతర నిఘా
ప్రధాని పాల్గొనే కార్యక్రమాల పరిధిలోని ప్రాంతాలన్నీ స్నిప్పర్స్, క్విక్ రెస్పాన్స్ బృందాలు, మఫ్టీ పార్టీల నిఘా
సిటీ పోలీస్ తో ఎస్పీజీ ఎప్పటిప్పుడు మానిటరింగ్
ప్రధాని బస చేసే ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లోకి
డ్రోన్స్ ఎగిరివేతపై నిషేధం
పరేడ్ గ్రౌండ్స్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్ గ్రౌండ్ ఫ్లై ఓవర్ ను పూర్తిగా క్లోజ్
చుట్టు పక్కల బిల్డింగ్స్ ను శనివారం నుంచే ఎస్సీజీ తమ ఆధీనంలో తీసుకుంది
బేగంపేట్ విమానాశ్రయం, హెచ్ఐసిసి నోవెటెల్, పెరేడ్ గ్రౌండ్, రాజ్ భవన్ చుట్టూ అనుక్షణం పటిష్ఠ భద్రత
నగరవాసులు సహకరించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీపై పదునైన విమర్శలు సంధించిన నేపథ్యంలో ప్రధాని ఎలా కౌంటర్ చేయబోతున్నారు.. అసలేం మాట్లాడబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
సాయంత్రం 6.30గం. నుంచి రాత్రి 7.30 గంటల వరకు మోదీ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ ఉంటుంది. సాయంత్రం 5.55 గంటలకు ప్రధాని మోదీ హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధానంగా తెలంగాణ సహా దక్షిణాదిలో పార్టీ బలోపేతంపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల రెండో రోజు కీలక అంశాలపై చర్చించనున్నారు. భాగ్యనగర్ డిక్లరేషన్ పేరిట కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించనున్నారు.
బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళ్‌సై సౌందరరాజన్ ప్రధాని నరేంద్ర మోదీని సాదరంగా ఆహ్వానించారు.
బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళ్‌సై సౌందరరాజన్ ప్రధాని నరేంద్ర మోదీని సాదరంగా ఆహ్వానించారు.
జల విహార్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
మోదీ పాలనలో దేశం తిరోగమనం
మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు
మోదీ ప్రధానిగా కాకుండా సేల్స్‌మ్యాన్‌లా వ్యవహరిస్తున్నారు
శ్రీలంకపై చేసిన ఆరోపణలకు మోదీ మౌనమెందుకు
శ్రీలంక విషయంలో స్పందించకపోతే దోషిగానే చూడాల్సి వస్తుంది
మేము మౌనంగా ఉండం..పోరాటం చేస్తాం...
మేకిన్ ఇండియా అనేది శుద్ధ అబద్ధం
ద్రవ్యోల్బణం పెరిగింది... జీడీపీ పడిపోయింది...
మోదీ పాలనలో నల్లధనం ఎంత వెనక్కి తెచ్చారో చెప్పాలి
ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు
రైతులు, సైనికులు, ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్నారుజల విహార్ సభలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హా
దేశంలో ప్రజా ఉద్యమం మొదలైంది.
టీఆర్ఎస్ తరపున కేటీఆర్ ఢిల్లీ రావడంతో నాకు మరింత బలం చేకూరింది.
రాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు- ఇద్దరి ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య పోటీ.
నేను నమ్ముతాను దృఢమైన సంకల్పంతో వెళ్తే విజయం తధ్యం.
8 ఏళ్ల పాలనలో మోడీ ఒకసారి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు.
8 ఏళ్ల కాలంలో మీడియా ముందుకు వచ్చేందుకు ధైర్యం చేయలేదు.
ఈ పోరాటం రాష్ట్రపతి ఎన్నికతోనే ఆగదు- తరువాత కూడా పోరాటం కొనసాగుతుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుపుకొని జాతీయ పోరాటం చేస్తాం.
దేశాన్ని ముందుకు నడిపేందుకు కేసీఆర్ తనవంతు కృషి తెలంగాణ రాష్ట్రంలో చేశారు.
కేసీఆర్ విజన్ బాగుంది..దాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలి.
మా పోరాటం భారత భవిష్యత్ కోసం చేస్తున్నాం.
దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ మూలాలను రక్షించడానికి మేము పోరాటం చేస్తున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన ప్రతి వర్డ్ వాస్తవం.కేసీఆర్ ఒక్కడే తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్ లో కొట్లాడారు.
కేసీఆర్ తన స్వప్నం నెరవేర్చుకున్నారు..కానీ అక్కడితో ఆగకుండా తెలంగాణను దేశంలో నెంబర్ గా నిలిపారు.
జల విహార్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్
ఇండియాలో విచ్చలవిడితనం పెట్రేగిపోతోంది...వాళ్ళను కంట్రోల్ చేయలేవా?
ఇండియా ప్రధాని శక్తిహీనమైన వ్యక్తినా?
అమెరికా ఎన్నికలను అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నవా మోడీ?
నరేంద్రమోదీ దేశానికి క్షమాపణ చెప్పాలి?
10 ఏళ్ల కాలం మోడీ ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే..8 ఏళ్ళు వృధా చేశారు.
నీటి వసతి పుష్కలంగా ఉన్నా దేశ ప్రజలకు తాగేందుకు నీళ్లు లేవు.
అందరం కలిసి తెలంగాణ సాధించాం..
నయె భారత్ నిర్మాణం కోసం మళ్ళీ మనం పోరాటం చేయాలి
హైదరాబాద్ పౌరుషం అంటే ఏంటో మళ్ళీ దేశానికి ఇవ్వాళ కనిపించింది
జల విహార్ సభలో కేసీఆర్.. :
మోదీకి, నాకు వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదు
కానీ మోదీ ప్రజా విరోధి, ప్రజాస్వామ్యానికి విరోధి..
ఆ విరోధం గురించే నేను మాట్లాడుతున్నా..
యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్ స్పీచ్
ప్రతిపక్షాలపై ప్రధాని అసత్య ఆరోపణలు చేస్తున్నారు
మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
టార్చిలైట్ వేసి వెతికినా మోదీ అమలుచేసిన హామీలు కనిపించవు
డీజిల్ సహా అన్ని ధరలు పెంచేశారు
వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారు.. రైతులను జీపుతో తొక్కించారు
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు దూరంగా ఉండాలన్న పీసీసీ చీఫ్ రేవంత్ ఆదేశాలను లెక్క చేయని వీహెచ్..
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన సీఎం కేసీఆర్..