TS Inter Results Live Updates: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. ఫలితాల్లో బాలికలదే పైచేయి
TS Inter Results Live Updates : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
TS Inter Results Live Updates: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను మంత్రి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి సబితా అభినందనలు తెలిపారు. ఫలితాలపై ఎప్పటికప్పుడు కీలక అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Latest Updates
ఇంటర్ సెకండియర్ ఫలితాల పూర్తి డేటా..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఫస్టియర్‌లో జిల్లాల వారీగా బాలికలు, బాలుర ఉత్తీర్ణత శాతం..
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. జిల్లాల వారీగా బాలికలు, బాలుర ఉత్తీర్ణత
ఇంటర్ పరీక్షలు జరిగిన 33 రోజుల్లో ఫలితాలు విడుదల
పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేసిన అధికారులందరికీ మంత్రి సబిత కృతజ్ఞతలుపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినవారికి మంత్రి అభినందనలు
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినవారికి అభినందనలు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. భవిష్యత్తులోనూ వారు విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉత్తీర్ణత సాధించనివారు జూన్ 30 నుంచి సప్లిమెంటరీకి ఫీజు చెల్లించాలన్నారు.
ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించనివారికి ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు కూడా పరీక్షలు రాయవచ్చు. జూన్ 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్ పరీక్షా ఫలితాలు
ఇంటర్ పరీక్ష రాసిన మొత్తం విద్యార్థులు-9,28,262
ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన మొత్తం విద్యార్థులు 5 లక్షల 97 వేల పైచిలుకు
ఫస్టియర్‌లో 4,64,892 మంది పరీక్ష రాస్తే 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్‌లో 4,63,370 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,95,949 మంది ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్ ఫస్టియర్‌లో అత్యల్పంగా మెదక్ జిల్లాలో 40 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ సెకండియర్‌లో అత్యల్పంగా మెదక్ జిల్లాలో 47 శాతం ఉత్తీర్ణత
ఇంటర్ ఉత్తీర్ణత శాతం
ఫస్టియర్‌లో 63.32 శాతం
సెకండియర్‌లో 67.16 శాతంఫలితాల్లో మేడ్చల్ టాప్
ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రెండింటిలో మేడ్చల్ జిల్లా టాప్‌లో నిలిచింది.
ఫస్టియర్‌లో మేడ్చల్ జిల్లాలో 75 శాతం ఉత్తీర్ణత, సెకండియర్‌లో 78 శాతం ఉత్తీర్ణత
బాలికలదే పైచేయి
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో 72.33 శాతం, సెకండియర్‌లో 75.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో బాలురు 54.26 శాతం, సెకండియర్‌లో 59.21 శాతం ఉత్తీర్ణత సాధించారు.
కాసేపటి క్రితమే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
సప్లిమెంటరీ ఎప్పుడు..!
ఇంటర్ ఫరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఇటీవల వెల్లడించారు.
ఈ ఏడాది మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1443 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో 4,64,626 మంది ఫస్టియర్ విద్యార్థులు కాగా.. 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
మొదట https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in వెబ్‌సైట్లలో ఏదేని వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో ఇంటర్ ఫలితాలు ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఇప్పుడు మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి
అంతే.. స్క్రీన్‌పై మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి
ఫలితాల కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోండి.
ఇంటర్ ఫలితాలు ఈ వెబ్ సైట్స్‌లో
https://tsbie.cgg.gov.in
https://results.cgg.gov.in
https://examresults.ts.nic.in