YS Sharmila News Updates: కాసేపట్లో వైఎస్ షర్మిల విడుదల.. జైలు వద్దే ప్రెస్‌మీట్
YS Sharmila Arrest Live Updates: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరికాసేపట్లో ఆమె జైలు నుంచి విడుదల కానున్నారు. లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
YS Sharmila Arrest Live Updates: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో షర్మిల కారులో ఎక్కేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఆపేశారు. ఆమెను ముందుకు రానీయకుండా అడ్డుగా నిలబడ్డారు. షర్మిలకు పోలీసులు సర్దిజెప్పే ప్రయత్నం చేసినా.. పోలీసులను ముందుకు తోసుకుంటూ షర్మిల వెళ్లేందుకు ప్రయత్నించారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని షర్మిల నిలదీస్తూ.. రోడ్డుపైనే బైఠాయించారు. ఆమెను అరెస్ట్ అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులపై చేయి చేసుకున్నారు. చివరకు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Latest Updates
==> బెయిల్ పేపర్లతో జైల్ వద్దకు చేరుకున్న షర్మిల తరుపు న్యాయవాదులు
==> మరి కాసేపట్లో చంచల్ గూడ జైల్ నుంచి విడుదల కానున్న వైఎస్ షర్మిల
==> సాయంత్రం 4 గంటల తరువాత జైలు వద్దే మీడియాతో మాట్లాడనున్న వైఎస్ షర్మిల
==> షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
==> రూ.30 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు
==> విచారణకు సహకరించాలని చెప్పిన కోర్టు
==> ప్రస్తుతం చంచల్‌గూడ జైల్‌లో ఉన్న వైఎస్ షర్మిలవైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
చంచల్‌గూడ జైల్లో వైఎస్ షర్మిలను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
==> ప్రజల కోసం పోరాడే వ్యక్తిని.. ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిని ప్రభుత్వం అణచివేస్తోంది
==> పోలీసుల అత్యుత్సాహాన్ని, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు
==> షర్మిల ప్రజల కోసం 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసింది
==> షర్మిల ఇలాంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదు
==> ప్రభుత్వాన్ని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తుంది
==> గ్రూప్స్, పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతుంటే అడగటం తప్పా..?
==> షర్మిల సిట్‌కు ఒంటరిగా వెళ్లి ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకున్నట్లు..?
==> ఆమె క్రిమినలా..? టెర్రరిస్టా..?
==> ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడుకుంటుంది
==> అందుకే నిరుద్యోగుల సమస్యలపై షర్మిల పోరాటం చేసింది
==> కాంగ్రెస్, బీజేపీ పార్టీల సమావేశాలకు అనుమతులు ఇచ్చి షర్మిలను మాత్రం ఎందుకు ఇంట్లోంచి బయటకు రానివ్వడం లేదు..?
==> ప్రశ్నించే గొంతుకలను అరెస్టులు చేయడం న్యాయమేనా..?
==> ఇదేనా ప్రభుత్వ విధానం..?
==> ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు
==> ప్రజల సమస్యలు చూపిస్తుంటే సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఇలా అరెస్ట్ చేయడమేంటి..?
==> ఎంత కాలం అరెస్టులు చేస్తారు.. జైల్లో పెడతారు..?
==> ఇలా అణచి వేస్తూ ప్రజలే ప్రశ్నించే రోజు తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని.. పోలీసులను కోరుతున్నా..
==> ప్రభుత్వం ప్రతిపక్షాలపై తన తీరు మార్చుకోకపోతే ప్రజలు, నిరుద్యోగులు సరైన సమాధానం చెప్తారు
==> షర్మిల మళ్లీ బెయిల్‌పై విడుదల అవుతుంది.
==> ప్రజలు, నిరుద్యోగుల కోసం పోరాడుతుంది
==> ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా
==> మీడియా ప్రజల కోసం పని చేయాలి.
==> మీడియా వాస్తవాలను మాత్రమే చూపించాలని కోరుతున్నాం
వైఎస్ షర్మిల అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
YS Sharmila: వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ కొనసాగనుంది. నాంపల్లి కోర్టులో ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది.
YS Sharmila: వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.
==> షర్మిలకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..
==> షర్మిలకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
==> మే 8వ తేదీ వరకు రిమాండ్ విధింపు
- పది మంది మహిళా పోలీసులు నాపై పడుతూ, ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ నన్ను కార్లో ఎక్కించబోతే నాకు కూడా ఆవేశం వచ్చింది.
- పోలీసులు షర్మిల డ్రైవర్‌ను కొట్టారు, గన్ మెన్లను కొట్టారు, మీడియా వాళ్లను కొట్టారు.. ఎందుకిలా వ్యవహరిస్తున్నారు.
- మీడియాకు చేతులెత్తి అభ్యర్థిస్తున్నా ప్రజల తరఫున నిలబడండి. మీడియా నిజాలు చూపించాలి. చిన్నచిన్న విషయాలను పెద్దగా చూపించడం కాదు. మీడియా ప్రజల కోసం పని చేయాలి.
- వైయస్ షర్మిల ప్రజల కోసం పోరాడుతుంది. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు సాకారం చేయడానికి కష్టపడుతోంది.
- ఒక మహిళ 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిందంటే ప్రజలు ఆలోచించాలి
- న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంతకాలం అణచివేస్తారు.
- ప్రతిపక్షాలు ప్రశ్నించిన వాటికి పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేంటి?
- ఇలా ఎన్ని సార్లు పోలీసులు అరెస్టులు చేస్తారు
- అసమర్థతను పక్కనపెట్టి.. నియంత పాలన వదిలి ప్రజల కోసం పని చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం
- ఈ విషయంపై కోర్డుకు వెళ్తాం: వైఎస్ విజయమ్మ==> 10 మంది మహిళా పోలీసులు మీద పడితే ఆవేశం వచ్చింది..
==> ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే కోపం రాదా..?
==> నేను కొట్టాలని కొట్టలేదు
==> గ్రూప్ పేపర్లు లీక్ అయ్యాయి.. టెన్త్ పేపర్లు లీక్ అయ్యాయి..
==> షర్మిల ప్రజల కోసం పోరాడుతోంది: విజయమ్మ==> ఎప్పుడు చూసినా మా ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారు..
==> పోలీసులు మీద మీద పడుతుంటే ఆవేశం రాదా..?
==> ఇది అసమర్థ ప్రభుత్వం
==> పోలీసులను కొట్టాలనే ఉద్దేశం షర్మిలకు, నాకు లేదు: వైఎస్ విజయమ్మవైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఏం జరిగిందని షర్మిలను అడిగి తెలుసుకున్నారు.
వైఎస్ షర్మిల అరెస్ట్‌ను వైఎస్ విజయమ్మ ఖండించారు. ఈ ఎపిసోడ్‌పై మధ్యాహ్నం 2 గంటలకు ఆమె ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.
==> పోలీసులపై వైఎస్ షర్మిల దాడి చేశారు..
==> సిట్ ఆఫీస్‌కు వెళ్లేందుకు అనుమతి లేదని ముందే చెప్పాం..
==> వైఎస్ షర్మిలపై కేసు నమోదైంది
==> ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
==> పోలీసుల సూచనలు పట్టించుకోకుండా షర్మిల బయటకువచ్చారు..
==> విజయమ్మ కూడా పోలీసులపై చేయి చేసుకున్నారు
==> షర్మిల ఎక్కడికి వెళుతున్నారో సమచారం లేదు: సీపీ సీవీ ఆనంద్==> జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత
==> జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చిన వైఎస్ విజయమ్మ
==> పోలీసులపై దాడి కేసులో షర్మిలను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
==> విజయమ్మను పీఎస్‌లోకి అనుమతించని పోలీసులు..
==> పోలీసులతో విజయమ్మ వాగ్వాదం..
సిట్ కార్యాలయానికి నేను ఒక్కరినే వెళ్లాలని అనుకున్నానని.. సిట్ అధికారిని కలిసి టీఎస్పీఎస్సీ దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలని అనుకున్నామని చెప్పారు వైఎస్ షర్మిల. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు తమ అనుమానాలను అధికారికి చెప్పడం తమ బాధ్యత అని అన్నారు. సిట్ ఆఫీస్‌కి వెళ్లడానికి తాను ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని.. తాను ధర్నాకు పోలేదని.. ముట్టడి అని పిలుపునివ్వలేదన్నారు. తనను బయటకు పోనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు..? ప్రశ్నించారు.
'నేను ఏమైనా క్రిమినల్ నా..? హంతకురాలినా..? నాకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా..? నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు..? పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారు. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారు. నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నా మీద పడితే నేను భరించాలా..? నా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా బాధ్యత. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు..?' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.