Liquor Sales: లాక్‌డౌన్ ప్రభావంతో ..రెండ్రోజుల్లో 2 వందల కోట్ల మద్యం అమ్మకాలు
Liquor Sales: కొంపలు మునిగిపోతున్నా..కాలిపోతున్నా మందుబాబులు మందు మాత్రం మానరు కదా. ఓ వైపు కరోనా చంపేస్తుందని అంటున్నా..మందుబాబులు ఎగబడ్డారు. కేవలం రెండ్రోజుల వ్యవధిలో ఎంత తాగేశారో తెలుసా..
Liquor Sales: కొంపలు మునిగిపోతున్నా..కాలిపోతున్నా మందుబాబులు మందు మాత్రం మానరు కదా. ఓ వైపు కరోనా చంపేస్తుందని అంటున్నా..మందుబాబులు ఎగబడ్డారు. కేవలం రెండ్రోజుల వ్యవధిలో ఎంత తాగేశారో తెలుసా..
దేశంలో కరోనా మహమ్మారి (Corona pandemic) విజృంభిస్తోంది. వైరస్ కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ (Lockdown) బాట పడుతున్నాయి. తెలంగాణ కూడా ఇప్పుడు లాక్‌డౌన్ అమలు చేస్తోంది. నిన్న సాయంత్రం అంటే మే 11వ తేదీన లాక్‌డౌన్ ప్రకటన వెలువరించినప్పటి నుంచి మందుబాబులు ఒక్కసారిగా మద్యం దుకాణాలకు పరుగులు తీశారు. నిత్యావసర వస్తువులు కోసం కూడా ఇంతలా పరుగులు తీయరేమో. పదిరోజుల పాటు మద్యం లభించకపోతే ఇంకెలా అనే తెగ ఆందోళన చెందినట్టున్నారు. కేవలం రెండ్రోజుల్లో భారీగా మద్యం కొనుగోలు చేసేశారు. రెండ్రోజుల్లో 2 వందల కోట్ల రూపాయల మధ్యం విక్రయమైంది. నిన్న ఒక్కరోజే 125 కోట్ల మద్యం అమ్ముడైంది.
తెలంగాణ(Telangana)లో ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్ (Lockdown) అమలు చేస్తున్నట్టు నిన్న సాయంత్రం అంటే మే 11వ తేదీన ప్రకటించారు. సాధారణ, నిత్యావసరాలకు ఉదయం 6 గంటల్నించి 10 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. దాంతో మద్యం దుకాణాల వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. మే 1 నుంచి 12 వ తేదీ వరకూ అంటే ఇవాళ్టి వరకూ తెలంగాణలోని అన్ని డిపోల్లో 770 కోట్ల మద్యం అమ్మకాలు (Liquor Sales) జరిగితే..ఈ రెండ్రోజుల్లోనే 219 కోట్ల రూపాయల మద్యం విక్రయమైంది.
Also read: No Entry for Ambulance: అంబులెన్స్‌లను రెండవ రోజు కూడా నిలిపివేస్తున్న తెలంగాణ పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook