Lovers committed suicide in suryapet district Telangana: హైదరాబాద్: తెలంగాణ ( Telangana ) లోని సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమ జంట తెల్లవారే సరికి విగతజీవులుగా కనిపించారు. ప్రేమికులు బలవన్మరణానికి (Lovers suicide) పాల్పడిన సంఘటన సూర్యపేట ( suryapet) జిల్లాలోని మునగాల మండలం మొద్దుల చెరువు శివారులో జరిగింది. అయితే ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరిద్దరూ గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన వారు మొద్దుల చెరవు శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read : Hyderabad Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి 


మృతులది చివ్వెంల మండలం (chivvemla mandal) చందుపట్ల గ్రామానికి చెందిన నవీన్(21), 18 ఏళ్ల యువతిగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా పేర్కొంటున్నారు. అయితే ఇరువురు గురువారం రాత్రి ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారిద్దరూ బైక్‌పై మోద్దుల చెరువు స్టేజ్ దగ్గరికి వచ్చి ఒకే చీరతో చెట్టుకి ఉరి వేసుకుని ( Lovers committed suicide ) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Also Read : Jana Reddy: నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్‌పై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook