LPG gas cylinder price hike: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ల తరహాలోనే వ్యాపారం అవసరాల కోసం హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నిర్వాహకులు వినియోగించే కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు సైతం అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. తాజాగా 19 కిలోల కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 100 మేర పెరిగింది. నవంబర్ 1 తర్వాత ఇలా ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LPG price hike అనంతరం కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయంటే..
దేశ రాజధాని ఢిల్లీలో కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు రూ. 2101 కి చేరుకున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కమెర్షియల్ సిలిండర్ల ధరలు రూ. 2051 కి చేరాయి. కోల్‌కతాలో కమెర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఇంకాస్త ఎక్కువగానే పలుకుతోంది. కోల్‌కతాలో కమెర్షియల్ సిలిండర్ ధర రూ. 2,174.50 కాగా చెన్నైలో అత్యధికంగా ఒక్కో కమెర్షియల్ సిలిండర్ ధర రూ. 2,234.50 పలుకుతోంది. 


Also read : Gold Price Today: మరోసారి తగ్గిన బంగారం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధర


నవంబర్ 1 వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ కమెర్షియల్ సిలిండర్ ధర 1,734 రూపాయలు పలికేది. అయితే, నవంబర్ 1న కమెర్షియల్ సిలిండర్ల ధరలు రూ. 266 మేర పెరిగింది. దీంతో ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఒక్కసారిగా రూ. 2000 మార్కుని తాకాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఇంచుమించు ఇదే ట్రెండ్ కనిపించింది. కమెర్షియల్ సిలిండర్ల ధరలతో పాటే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను (LPG prices today in your city) మరోసారి పెంచకపోవడం కొంతలో కొంత ఉపశమనం అనే చెప్పుకోవచ్చు అంటున్నాయి మార్కెట్ వర్గాలు.


Also read : Petrol Price In Delhi: ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. పెట్రోల్ పై రూ.8 తగ్గింపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook