LRS In Telangana:  వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ అంశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ దీనిపై వెనక్కి తగ్గింది. ఎల్ఎస్ఆర్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది. అనుమతులు లేని, క్రమబద్దీకరణ కానీ కొత్త ప్లాట్లు, కొత్త లేఅవుట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలంగాణ (Telangana)లో ఇదివరకే రిజిస్ట్రేషన్ పూర్తి అయిన ప్లాట్లు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ అడ్డంకులు తొలగిపోయాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి ప్రక్రియ జరిగేలా చూడాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. 


Also Read: New CoronaVirus Strain: కొత్త వైరస్‌ భయంకరమైనది కాదు: మంత్రి ఈటల రాజేందర్



ఎల్ఆర్ఎస్(LRS) లేకున్నా..  పాత ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు ఆపకూడదని మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొన్ని నెలలుగా సాగిన వివాదానికి నేడు తాత్కాలిక పరిష్కారం దొరికినట్లు కనిపిస్తోంది. మరోవైపు అనుమతులు లేని లే ఔట్లకు క్రమబద్దీకరణకు సైతం ప్రభుత్వం గతంలో అవకాశం ఇచ్చింది. అయితే అధిక ధరలకు క్రమబద్దీకరణ చేస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


Also Read: LRS పాత దరఖాస్తులపై మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం



కాగా, 2015 ఏడాది ఉన్న ఫీజులతోనే క్రమబద్దీకరణ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేయడంతో కొన్ని నెలలుగా రాష్ట్రంలో వీటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. హైకోర్టు సైతం జోక్యం చేసుకుని ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేయడంలో కొన్ని రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. తాజాగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయి.


Also Read: Tollywood నటుడు వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్.. షాకింగ్ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook