Mahabubabad: పట్టపగలు టీఆర్ఎస్ నేత దారుణ హత్య... గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు..
Mahabubabad TRS Leader Murder: మానుకోట మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవి హత్య స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు రవిపై గొడ్డళ్లతో దాడి చేసి చంపారు.
Mahabubabad TRS Leader Murder: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నేత హత్య తీవ్ర కలకలం రేపుతోంది. పట్టపగలే టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవిని గుర్తు తెలియని దుండగులు గొడ్డళ్లతో నరికారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బానోత్ రవి మానుకోట మున్సిపాలిటీలోని 8వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నాడు. ఈ ఉదయం పత్తిపాక కాలనీ మీదుగా బైక్‌పై వెళ్తుండగా అతనిపై దాడి జరిగింది. భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలే హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో బానోత్ రవి నాయక్ నల్ల బెల్లం వ్యాపారం కూడా చేసినట్లు చెబుతున్నారు. ప్రత్యర్థులే అతన్ని చంపి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి.
బానోత్ రవి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎంపీ మాలోత్ కవిత రవి కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు తెలుస్తోంది.
బానోత్ రవి ఇండిపెండెంట్‌గా గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరాడు. అధికార పార్టీ నేత అయిన రవి హత్య జిల్లాలో సంచలనంగా మారింది. రవిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది... పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. బానోత్ రవి హత్యను టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read: Video: అర్జున్ టెండూల్కర్ అదిరిపోయే యార్కర్.. అతనికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్న నెటిజన్లు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.