చక్రం తిప్పిన అసదుద్దీన్ ఒవైసీ
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రతిపాదించిన జాబితా కాకుండా టీఆర్ఎస్ పార్టీతో స్నేహ పూర్వక రాజకీయ సంబంధాలు కలిగియున్న ఎంఐఎం సూచించిన అభ్యర్థికి డీసిసీబీ పదవి దక్కిందన్న చర్చ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ప్రతిపాదించిన జాబితా కాకుండా టీఆర్ఎస్ పార్టీతో స్నేహ పూర్వక రాజకీయ సంబంధాలు కలిగియున్న ఎంఐఎం సూచించిన అభ్యర్థికి డీసిసీబీ పదవి దక్కిందన్న చర్చ పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
మున్సిపల్ ఎన్నికల్లో పలు చైర్మన్ స్థానాలను కోరిన ఎంఐఎం అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ అంగీకరించకపోవడంతో ఎంఐఎం వెనకడుగు వేసిందని సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ఆ వెంటనే వచ్చిన సహకార ఎన్నికల్లో మైనార్టీలకు ఒక స్థానాన్ని కట్టబెట్టాలని పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ ముందు ఎంఐఎం ప్రతిపాదనలు ఉంచడంతో సీఎం కేసిఆర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం
అధికార పార్టీ వర్గాల్లో మొదలైంది.
పాలమూరు జిల్లానేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కూడా ఇందుకు కారణమైందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వినిపిస్తోందని,
మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు తమ అనుచరుల కోసం పట్టు బట్టడంతో ఇద్దరినీ కాకుండా మరో వ్యక్తికి డీసిసీబీ చైర్మన్ పదవిని పార్టీ కట్టబెట్టిందన్న చర్చ బహిరంగ అంశమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న నిజాం పాషా గులాబీ పార్టీ లో ఒక్క సారిగా డీసీసీబీ పదవి దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో మంత్రులు ఆదిపత్యం కోసం పావులు కదిపినా...పార్టీ హై కమాండ్ తీసుకున్ననిర్ణయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..