రఘునాథపల్లి: తెలంగాణలోని జనగామ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిల్లా షాపూర్‌లో శుక్రవారం (జనవరి 31న) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక తార ఇండస్ట్రీస్ టిన్నర్ పరిశ్రమలో రియాక్టర్లకు ఛార్జింగ్ పెడుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఛార్జింగ్ పెడుతుండగా రియాక్టర్ల నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది ప్రాణభయంతో భయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పరిశ్రమ కార్మికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పరిశ్రమ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున పొగ కమ్మేయడంతో అక్కడ మేఘామృతమై ఉన్నట్లు కనిపిస్తోంది. అగ్రి ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..