Mallareddy Clarity: మల్లారెడ్డి సంచలనం.. `నాకు ఈ రాజకీయాలు వద్దు` అంటూ రాజకీయ సన్యాసం ప్రకటన
Mallareddy Clarifys DK Shivakumar Meet: తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి వ్యవహారం కలకలం రేపింది. కాంగ్రెస్‌లో చేరుతారనే విస్తృత ప్రచారం జరగ్గా.. మల్లారెడ్డి మాత్రం ఆ విష ప్రచారాన్ని ఖండించారు. గులాబీ జెండాతోనే కొనసాగుతానని ప్రకటించారు.
Mallareddy: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను ఇతర పార్టీలు వల వేస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ను కలవడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరుతారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మల్లారెడ్డి వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మల్లారెడ్డితోపాటు అతడి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అన్ని ప్రధాన మీడియాలో చర్చ జరిగింది.
Also Raed: Kavitha: పుట్టినరోజు నాడే కూతురు కవితకు కేసీఆర్ భారీ షాక్..
ఈ వార్తల నేపథ్యంలో మల్లారెడ్డి స్పష్టత ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని, కేవలం వ్యాపారం విషయంలో డీకే శివకుమార్‌ను కలిసినట్లు వివరణ ఇచ్చారు. ఐదేళ్ల పాటు బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారుతాననే దుష్ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ఫోన్‌లో మల్లారెడ్డి మాట్లాడారు. 'నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖందిస్తున్నా' అని తెలిపారు.
Also Read: BRS Party: బీఆర్‌ఎస్ పార్టీ సంచలనం.. వారిని కాదని వీరికి నాలుగు టికెట్లు కేటాయింపు మరి గెలుస్తారా?
డీకే శివకుమార్‌ను కలవడంపై స్పందిస్తూ.. 'నేను డీకే శివకుమార్‌ను కలిశాను. నేను వ్యాపారం నిమిత్తం అతడిని కలిశాను. నా మిత్రుడుకి సంబంధించిన ఓ యూనివర్సిటీ కొనుగొలు విషయంలో నన్ను మధ్యవర్తి తీసుకెళ్లాడు. యూనివర్సిటీ కొనుగోలు కోసం మాట్లాడేందుకు మాత్రమే వెళ్లాను. పార్టీ మారుతానన్న వార్తల్లో వాస్తవం లేదు. అదంతా అసత్య ప్రచారం. ఐదేళ్ల పాటు బీఆర్‌ఎస్ పార్టీని వదిలేది లేదు. నా వయసు ఇప్పుడు 75 ఏళ్లు. రాబోయే ఎన్నికలలో నేను పోటీ చేయను. లోక్‌సభ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి నా కుటుంబసభ్యులు ఎవరూ పోటీ చేయడం లేదు' అని ప్రకటించారు.
అయితే మల్లారెడ్డి ప్రకటన అనుమానాలకు తావిస్తోంది. మల్లారెడ్డి వ్యవహారం ఇక్కడితో ఆగదని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా మల్లారెడ్డి ఆస్తులపై పడింది. మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కళాశాలలపై బుల్డోజర్లతో కూల్చిన విషయం తెలిసిందే. పార్టీలో చేరకపోతే మరిన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డిని డీకే శివకుమార్‌ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్‌లో మల్లారెడ్డి పార్టీ చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఉన్న కళాశాలలు, ఆస్తులను కాపాడుకోవడానికి మల్లారెడ్డి కుటుంబం విధిలేక కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి