Hyderabad Blast: హైదరాబాద్ లో పాతబస్తీలో కలకలం రేగింది. శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఉలిక్కి పడింది. పేలుడులో ఓ వ్యక్తి చనిపోయాడు. పేలుడు ధాటికి అతని శరీరం ముక్కలైపోయింది. మరో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. పేలుడు ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని అఫ్జల్‌గంజ్‌లో ఆదివారం శక్తివంతమైన పేలుడు జరిగింది. రసాయన పేలుడు కావడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ పేలుడులో వ్యక్తి బాడీ ముక్కలైంది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.పేలుడులో శరీరం ముక్కలై పోయిన వ్యక్తిని 32 సంవత్సరాల భరత్ గా గుర్తించారు. పేలుడు ఘటనపై సమాచారం అందిన వెంటనే స్పాట్ కు చేరుకున్నారు పోలీసులు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.


పేలుడు జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించారు పోలీసులు. రసాయన పేలుడుగా ప్రాథమికంగా నిర్ధారించారు.పేలుడు జరిగిన తీరుపై ఆరా తీశారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఇటీవల వరుసగా జరుతున్న నేరాలతో హైదరాబాదీలు కలవరపడుతున్నారు. తాజాగా పేలుడు జరగడంతో ఏం జరిగిందోనని తీవ్ర ఆందోళనకు లోనయ్యారు.


Read also: President election: వెంకయ్య నాయుడికి నిరాశే.. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. ఉప రాష్ట్రపతిగా నక్వీ?  


Read also: Omicron Virus: కోరలు చాస్తున్న ఒమిక్రాన్..షాకింగ్ విషయాలు వెల్లడించిన రష్యన్ శాస్త్రవేత్తలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి