Manchirevula Forest Trek Park: నగర శివార్లలోని మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అనంతరం అక్కడ జరిగిన కోటి వృక్షార్చన లో భాగంగా  మొక్కలు నాటారు. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవులలో రూ. 7.38 కోట్ల వ్య‌యంతో 256  ఎక‌రాల వీస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌ను అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూగర్భ గనుల, సమాచార శాఖ  మహేందర్ రెడ్డి ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం సఫారీ వాహనంలో పార్కు అంతా కలియ తిరిగారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అటవీ అభివృద్ధి  సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


అర్బ‌న్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ  పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్‌లో అదనపు ఆకర్షణగా నిలువ‌నుంది. ఈ పార్కులో గ‌జీబో, వాకింగ్ ట్రాక్,  ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్, త‌దిత‌ర‌ స‌దుపాయాలు క‌ల్పించారు.


పార్క్ ప్రత్యేకతలు
విస్తీర్ణం: 256 ఎకరాలు
వ్యయం: రూ. 7.38 కొట్లు
పొడవు: 5.6 కి. మీ.
మొక్కలు: 50 వేల రకాలు
ట్రెక్కింగ్ ట్రాక్: 2 కి. మీ.
వాకింగ్ ట్రాక్: 4 కి. మీ.


ఇది కూడా చదవండి : Kamareddy MLA Election: కామారెడ్డిలో కేసిఆర్‌ ఇక గెలిచినట్టేనా ?


109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను ఇప్పటివరకు 73 పార్కులు అందుబాటులోకి రాగా ఇవాళే 74వ పార్కును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విటర్ ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నారు.


ఇది కూడా చదవండి : SC, ST Decleration: చేవెళ్ల ప్రజాగర్జన సభలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి