TRS Leader Killed: కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి టీఆర్ఎస్ నేత దారుణ హత్య

మావోయిస్టులు చెలరేగిపోయారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేత, వ్యాపారవేత్త ఇంటికి వెళ్లి దాడి చేసి ఆయనను దారుణంగా హత్య (TRS Leader Killed In Mulugu) చేశారు. కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి టీఆర్ఎస్ నేతను హత్య చేశారు.
ములుగు(Mulugu) జిల్లాలో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నేత భీమేశ్వర్ రావు (48) ఇంటిపై దాడి చేసిన మావోయిస్టులు కత్తితో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి ఆయనను హత్య (TRS Leader Killed) చేశారు. జిల్లాలోని వెంకటాపురం మండలం భోదాపురంలో శనివారం రాత్రి ఈ దారుణం జరిగింది. టీఆర్ఎస్ నేతను హత్య చేసిన అనంతరం అక్కడ లేఖ వదలి వెళ్లినట్లు సమాచారం.
Telangana: తెలంగాణ కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
పోలీసుల కథనం ప్రకారం... టీఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావు స్థానికంగా ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తూ వ్యాపారం చేస్తుండేవాడు. అయితే పోలీసులు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల్లో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పురుగుల మందులు, ఎరువులు విక్రయించే టీఆర్ఎస్ నేతను లక్ష్యంగా చేసుకుని హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తమ ఉనికి చాటుకోవాలనే ఉద్దేశం సైతం ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. (Photo Credit: ntnews)
Telangana Covid-19: రాష్ట్రంలో 35లక్షలు దాటిన కరోనా టెస్టులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe