Maoists Killed In Encounter: మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో దాదాపు 10 మంది మావోలు మృతి చెందారు. ఈ ఉదాంతం మరువక ముందే మరో భారీ ఎన్ కౌంటర్ తెలంగాణలో చోటు చేసుకుంది.
Maoists Kill Woman Cadre Alleges Her As Police Informer: పార్టీ రహాస్యాలు పోలీసులకు అందిస్తుందనే నెపంతో తోటి నాయకురాలిని మావోయిస్టులు హతమార్చారు. మరో వెన్నెల కథగా కనిపించే యథార్థ సంఘటన ఇది.
Chattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Encounter Broke Out 8 Maoists Killed In Bijapur: దండకారణ్యంలో తుపాకీల మోత మోగింది. తుపాకీ గుళ్ల శబ్ధంతో అటవీ ప్రాంతం మార్మోగింది. ఫలితంగా రక్తంతో అడవి ఎరుపెక్కింది. పోలీసుల ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.
Villagers Protests Against Maoists: నక్సలిజం వద్దు .. తమకు అభివృద్ధే ముద్దు అంటూ మావోయిస్టులను తమ గ్రామాల్లోకి రావద్దంటూ మారుమూల గ్రామాల ఆదివాసీలు రోడ్డెక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy About Pro. Haragopal: ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడిన రేవంత్ రెడ్డి... ప్రో. హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు.
FIR Filed Against Professor Haragopal: పౌరహక్కుల సంఘాల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌పై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో దేశ ద్రోహం కేసు నమోదైంది. మావోయిస్టులకు ప్రొఫెసర్ హరగోపాల్ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే అభియోగాల కింద గత ఏడాది ఆగస్టు 19నే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Maoist Recruitment in Telangana: తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతున్న మావోయిస్టులకు కొత్త రిక్రూట్మెంట్ కరువైపోయిందనుకున్న తరుణంలో తాజాగా మావోయిస్టులకు సహకరిస్తూ ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారనే వార్తకు ప్రాధాన్యత చేకూరింది.
Maoist Encounter in Chhattisgarh: మావోయిస్టు అగ్ర నాయకుడి ఆధ్వర్యంలో ముప్పై మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు సమావేశం అయ్యారని కోవర్టుల ద్వారా విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు.. వారి స్థావరం ఉన్న అమెబేడ అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
Maoist Leader Savitri: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కిష్టాపురం ఏరియా కమిటీ సెక్రటరీ సావిత్రి పోలీసుల ముందు లొంగిపోయారు. దండకారణ్యంలో ఆమె మొదటి తరం విప్లవ కారుల్లో ఒకరిగా ఉన్నారు. దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న 1994లో సావిత్రిని పెళ్లి చేసుకున్నారు.
నేటి నుంచి మావోయిస్ట్ పార్టీ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, ఏటూరు నాగారం, మంగపేటలోని అటవీ ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మావోయిస్ట్ సానుభూతి పరులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
Private bus on fire: ఆంధ్రా సరిహద్దులో మావోస్టులు దుశ్చర్చకు పాల్పడ్డారు. చింతూరు సమీపంలో ప్రైవేట్ బస్సును ఆపి.. అందులోని ప్రయాణీకులను దించేసి దానికి నిప్పంటించారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Maoists Kill Couple who left camp to get married : పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు మావోయిస్ట్‌ల హత్య చేసిన మావోయిస్టులు. సొంత క్యాడర్‌నే అంతమొందించుకుంటున్న పరిస్థితి. మహిళా మావోయిస్టులపై లైంగిక వేధింపులు పాల్పడుతున్నారంటోన్న ఎస్పీ సునీల్‌దత్.
IED Recovered and Neutralized : ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సైతం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. ఆ ప్రాంతంలో మరిన్ని చోట్ల ఒకేసారి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కోబ్రా బెటాలియన్‌కు చెందిన భద్రతా సిబ్బంది ఆ భారీ ఐఈడీని నిర్వీర్యం చేశారు.
Encounter: దండకారణ్యం దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు , మావోయిస్టుల కాల్పులతో భీకర వాతావరణం నెలకొంది. రెండు వైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. 22 మంది జవాన్లు అదృశ్యం కావడం ఆందోళన కల్గిస్తోంది.
మావోయిస్టులు చెలరేగిపోయారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేత, వ్యాపారవేత్త ఇంటికి వెళ్లి దాడి చేసి ఆయనను దారుణంగా హత్య (TRS Leader Killed In Mulugu) చేశారు. కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్పులు జరిపి టీఆర్ఎస్ నేతను హత్య చేశారు.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు లొంగుబాటుకు (Maoist leader Ganapathi Surrender) సిద్ధమయ్యాడని, కుటుంబ సభ్యులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.